ETV Bharat / entertainment

స్టార్​ హీరోలతో పనిచేస్తే వాటిని ఎదుర్కోవాల్సిందే!: తమన్ - Sarkaruvaari paata updates

Sarkaruvaari paata Music Director Thaman: 'సర్కారు వారి పాట' సినిమాలో సంగీత పరంగా సవాల్‌గా అనిపించిన అంశాలేంటో తెలిపారు సంగీత దర్శకుడు తమన్​. 'కళావతి' సాంగ్​ కోసం ఎన్ని వెర్షన్లు ప్రయత్నించారో చెప్పారు. పెద్ద హీరోలతో కలిసి పని చేస్తున్నప్పుడు తనకు ఎదురయ్యే సవాళ్లేంటో కూడా చెప్పుకొచ్చారు. దీంతో పాటు 'సర్కారు వారి పాట' సినిమా సహా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర సంగతులను వెల్లడించారు. ఆ సంగతులివీ..

Sarkaruvaari paata Music Director Thaman
మ్యూజిక్ డైరెక్టర్​ తమన్​ సర్కారు వారి పాట
author img

By

Published : May 1, 2022, 7:29 AM IST

Sarkaruvaari paata Music Director Thaman: "విజయాల్ని నేనెప్పుడూ తలకెక్కించుకోను. దర్శక నిర్మాతలు, హీరోలు నాపై పెట్టుకున్న అంచనాల్ని నిలబెడుతున్నానా? లేదా? అన్నదే నాకు ముఖ్యం" అన్నారు సంగీత దర్శకుడు తమన్‌. ఇప్పుడాయన నుంచి వస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. మహేష్‌బాబు హీరోగా దీన్ని పరశురామ్‌ తెరకెక్కించారు. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు.

పెద్ద హీరోలతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లేంటి?

ప్రేక్షకుల్లో ఉండే విపరీతమైన అంచనాలే మాకు ప్రధాన సవాల్‌. వాటిని అందుకోవడానికి ఇప్పటికిప్పుడే ఏదైనా స్కూల్‌కి వెళ్లి కొత్తగా నేర్చుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు పాటతో పాటు మేమూ ఓ రూపంగా తెరపై కనిపించాల్సిన పరిస్థితి వచ్చేసింది.

ఈ రోజుల్లో పాట అత్యధికంగా ప్రేక్షకులకు చేరువయ్యే అవసరం ఏర్పడుతోంది. ఇదేమైనా ఒత్తిడిగా అనిపిస్తుంటుందా?

ఒత్తిడి ఉంటుంది. దాన్ని కచ్చితంగా భరిస్తాం. ఇక్కడ మేము మంచి మ్యూజిక్‌ చేస్తామా? లేదా? అన్నది ఓ పాయింట్‌ అయితే.. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోగలుగుతామా? లేదా? అన్నది మరో అంశం. హీరో, దర్శకులు, అభిమానులు.. అందరి నుంచీ ఒత్తిడి ఉంటుంది. పైగా ఇతర భాషల నుంచీ పోటీ ఉంది. ఇలాంటివి ఉన్నప్పుడే మరింత ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయగలుగుతాం.

లిరికల్‌ వీడియోకి భారీగా ఖర్చు పెట్టడమన్నది మీతోనే మొదలైనట్లుంది కదా..?

ఆడియో కంపెనీలు దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. పాట బాగుంటే ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. వాళ్లకీ లెక్కలుంటాయి కదా. ఓ పాట 150 మిలియన్ల వ్యూస్‌కు చేరువవడం సామాన్యమైన విషయం కాదు. పాటలు ఇప్పుడు పాన్‌ ఇండియా అయిపోయాయి. ఓ పాట విజయం కోసం ఏ సింగర్‌తో పాడించాలి? హుక్‌ లైన్‌ గ్లోబల్‌గా ఉందా.. లేదా? లిరికల్‌ వీడియో ఎలా చేయాలి?.. ఇవన్నీ బాధ్యతగా చూసుకోవాల్సి వస్తోంది.

'సర్కారు వారి పాట' విషయంలో సంగీత పరంగా సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?

దీనికి ముందు పరశురామ్‌ చేసిన 'గీతాగోవిందం' పెద్ద మ్యూజికల్‌ హిట్‌. దాన్ని దృష్టిలో పెట్టుకొని సంగీతం అందించాల్సిన బాధ్యత నాపై పడింది. మహేష్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. అందులోనూ రెండేళ్ల తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా. ఇవన్నీ ఛాలెంజింగ్‌గా అనిపించాయి.

'కళావతి' గీతం అందరికీ బాగా నచ్చేసింది. దీని కోసం ఎన్ని వెర్షన్లు ప్రయత్నించారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

మొదటి వెర్షన్‌లోనే ఒకే అయ్యింది. హీరోయిన్‌ పాత్ర పేరు ఖరారు కాగానే అనంతశ్రీరామ్‌తో మాట్లాడి.. దీన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశాం. మహేష్‌బాబుకు 'సారొస్తారు' తర్వాత హాంటింగ్‌ మెలోడీ పడలేదు. అందుకే దీన్ని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దాం. తర్వాత 'పెన్నీ..' పాటకి సితారతో డ్యాన్స్‌ చేయించాలని నేనే నమ్రతని అడిగా.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ - శంకర్‌ సినిమాకి సంగీతమందిస్తున్నా. 'గాడ్‌ ఫాదర్‌' ఓ పాట మిగిలి ఉంది. విజయ్‌ - వంశీ పైడిపల్లి సినిమా మూడు పాటలు సిద్ధం చేశా. బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని చిత్రం ఓ పాట ట్యూన్‌ చేశా. ఒక బాలీవుడ్‌ సినిమా చర్చల దశలో ఉంది.

ఇదీ చూడండి: Tollywood: వెండితెరపై కార్మిక జెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.