Sarkaru vari paata collections: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారువారి పాట చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా 2వేలకుపైగా థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. కలెక్షన్ల పరంగా మాత్రం ఆల్‌టైం నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. తొలిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ.53 కోట్ల గ్రాస్, రూ.36.89కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల గ్రాస్, రూ.47.49కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఇందుకు సంబంధించి నిర్మాతలు అధికారిక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ప్రాంతాలవారీగా తొలిరోజు కలెక్షన్ వివరాలు
- నైజాం -రూ.12.24కోట్ల షేర్
- సీడెడ్ -రూ.4.70కోట్లు
- ఉత్తరాంద్ర -రూ.3.73కోట్లు
- తూర్పు గోదావరి -రూ.3.25కోట్లు
- గుంటూరు -రూ.5.83కోట్లు
- పశ్చిమ గోదావరి -రూ.3కోట్లు
- క్రిష్ణా -రూ.2.58కోట్లు
- నెల్లూరు -రూ.1.56కోట్లు
- తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ -రూ.36.89 కోట్లు
- కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా -రూ.3.60కోట్లు
- అమెరికా, ఇతర దేశాలు -రూ.7కోట్లు
- ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్ -రూ.47.49, మొత్తం గ్రాస్ రూ.73కోట్లు
Sarkaru vari paata: సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు. కీర్తి సురేశ్ మహేశ్‌కు జోడిగా నటించింది. సముద్రఖని విలన్‌గా, నధియా, తనికెళ్లభరణి, వెన్నెల కిశోర్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రం టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి లభించింది. అందుకే తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు సాధ్యమయ్యాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అగ్ర హీరోల క్రేజీ ప్రాజెక్టులు.. జూన్‌లో ముహూర్తాలు..