ETV Bharat / entertainment

'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్​- '9 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ - సర్కారు వారి పాట న్యూస్​

'సర్కారు వారి పాట' సినిమా సక్సెస్ సెలబ్రెేషన్స్​ను నిర్వహించింది చిత్ర బృందం. అలాగే దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘9 అవర్స్‌’ స్ట్రీమింగ్‌పై అప్డేట్​ వచ్చేసింది.

sarkari vari pata movie Success Celebrations - 9 Hours Web Series Release
'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రెషన్స్​- '9 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌
author img

By

Published : May 12, 2022, 7:53 PM IST

Updated : May 12, 2022, 11:22 PM IST

మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రానికి బాక్సాఫీసు వద్ద విశేష స్పందన లభించడం పట్ల ఆ చిత్ర దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ తమ చిత్రాన్ని తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిందని ఆనందం వ్యక్తం చేసిన మైత్రీ మూవీ మేకర్స్.... ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిమేక్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే మహేశ్ అభిమానులు ఆశించిన స్థాయిలో సర్కారు వారి పాట ఉండటం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న దర్శకుడు పరుశురాం... మధ్య తరగతి కుటుంబాల జీవితాలకు అద్దంపట్టే కథ ప్రేక్షకులకు బాగా నచ్చిందన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలతో కలిసి జూబ్లీహిల్స్ లోని నిర్మాణ సంస్థ కార్యాలయంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

sarkari vari pata movie Success Celebrations
'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రెషన్స్​

తారకరత్న '9 అవర్స్‌'..

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ అందించిన కథతో తెరకెక్కుతున్న ఆసక్తికర వెబ్‌ సిరీస్‌ ‘9 అవర్స్‌’. అజయ్‌, మధుశాలిని, తారక రత్న తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ జూన్‌2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆసక్తికర పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘డెక్కన్‌ ఇంపీరియల్‌ బ్యాంకు’లో 9గంటల పాటు ఏం జరిగిందన్న ఆసక్తికర కథతో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ సిరీస్‌కు నిరంజన్‌ కౌశిక్‌, జాకబ్‌ వర్గీస్‌లు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎన్టీఆర్​ లగ్జరీ లైఫ్​.. రూ.4కోట్ల వాచ్​.. రూ.25కోట్ల ఇల్లు.. ఇంకా ఏమున్నాయంటే?

Last Updated : May 12, 2022, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.