ETV Bharat / entertainment

డేటింగ్​లో​ సారా.. శుభ్​మన్​ జంట! మరోసారి కెమెరాకు.. నెట్టింట వీడియో వైరల్​ - శుభమన్​ గిల్​ డేటింగ్​ రూమర్స్​

టీమ్​ ఇండియా స్టార్ క్రికెటర్​ శుభ్​మన్​ గిల్​.. బాలీవుడ్​ హీరోయిన్​ సారా అలీఖాన్​ ఇద్దరు ప్రేమించుకుంటున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వార్తకు బలం చేకూరేలా మరో సారి కెమెరా కంట పడింది ఈ జంట.

sara  subhman dating rumors
sara ali khan and subhman gill
author img

By

Published : Oct 14, 2022, 4:46 PM IST

సినిమా.. క్రీడలకు ఎక్కడో అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి. ఎంతో మంది క్రీడాకారులు.. హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. మరికొందరు ప్రేమించుకుంటున్నారు. ఆ కాలంలో దిగ్గజ క్రికెటర్​ మన్సూర్​ అలీఖాన్​తో మొదలైన ఈ పరంపరకు తాజాగా విరుష్క జంట జతయ్యింది. ప్రేమ బంధాలు ముడి పడడమే కాకుండా డేటింగ్​ రూమర్స్​లోనూ ఈ రెండు రంగాలు ఏకమవుతున్నాయి. ఓ వైపు క్రికెటర్​ రిషబ్ పంత్.. హీరోయిన్​​ ఊర్వశీ రౌతెేలా డేటింగ్​ వార్తలు వస్తుంటే మరో వైపు శుభ్​మన్​ గిల్​.. సారా జంట కూడా లవ్​లో పడ్డట్లు రూమర్లు వస్తున్నాయి.

subhman gill friend post
శుభమన్​ గిల్​ ఫ్రెండ్​ పెట్టిన ఇన్​స్టా పోస్ట్​

కొంత కాలంగా క్రికెటర్​ శుభ్​మన్​ గిల్​తో బాలీవుడ్​ హీరోయిన్​ సారా అలీఖాన్​ డేటింగ్​లో ఉందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు. వీరిద్దరూ అనేక సార్లు కెమెరా కంట పడుతున్నారు. సారాతో కలిసి ఓ రెస్టారెంట్​లో డిన్నర్​ చేస్తున్న ఫొటో ఒకటి ఇటీవల వైరలయ్యింది. కానీ వీరిద్దరూ ఈ విషయంపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మరోసారీ ఈ జంట కలిసి తిరుగుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

దిల్లీలోని ఓ హోటల్​ నుంచి వీరిద్దరూ కలిసి బయటకి వస్తున్న వీడియో బయటకి వచ్చింది. మరో వీడియోలో విమానంలో శుభ్​మన్​ పక్కన సారా కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలను చూసిన అభిమానులు 'సారా ప్యార్​లో శుభ్​మన్​ పడిపోయాడ'ని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా శుభ్​మన్​ బర్త్​డే సందర్భంగా అతడి స్నేహితుడు పెట్టిన పోస్ట్ సైతం ఈ వార్తలకు బలాన్ని చేకూరిస్తుంది. 'బహుత్​ సారా ప్యార్​(బోలేడు ప్రేమతో)' అనే క్యాప్షన్​తో కొన్ని ఫొటోలను షేర్​ చేశాడు శుభమన్​ మిత్రుడు. ఈ లైన్​​ సారా గురించే రాసుంటాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: కర్వాచౌత్ వేడుకల్లో సినీ తారల సందడి.. కత్రిన, మౌనీరాయ్​ లుక్స్​ సూపర్​

బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా.. క్రికెట్​లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.