Sankranti Theatres Occupancy: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్ కావడం వల్ల రద్దీ పెరిగింది. ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ అంటూ గురువారం (జనవరి 11) రాత్రి నుంచే సినీలవర్స్ థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. విజువల్ వండర్స్ 'హనుమాన్' సినిమాకు ఆన్లైన్లో సగటున గంటకు 16వేల టికెట్లు బుక్ అవుతున్నాయట.
అటు మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా కూడా వంద శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఓపెనింగ్ డే కలెక్షన్లు అదరగొట్టేశాయని ఇన్ సైడ్ టాక్. ఇక శని, ఆదివారాల్లో 'సైంధవ్', 'నా సామిరంగ' సినిమాలు రానున్నాయి. పండగ సీజన్‌తో పలు ఆఫీస్‌లు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడం వల్ల రానున్న 5-6 రోజులు థియేటర్లలో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీలు నమోదు కావడం పక్కా.
మరోవైపు ఇదేరోజు బాలీవుడ్ మూవీ 'మెర్రీ క్రిస్మస్', తమిళ్ సినిమాలు 'అయలాన్', 'కెప్టెన్ మిల్లర్' రిలీజయ్యాయి. కానీ, వాటికి ఆయా రాష్ట్రాల్లో 'హనుమాన్', 'గుంటూరు కారం' స్థాయిలో ఆదరణ, ఓపెనింగ్స్ రాలేదనే చెప్పాలి. దీంతో కంటెంట్ బాగుంటే ఒకే రోజు ఎన్ని సినిమాలు వచ్చినా, తెలుగు ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారని అర్థమైపోతుంది.
-
Huge crowd gathered at Sudarshan 35mm RTC X ROADS For #MaheshBabu#GunturuKaaram #GunturKaraamReview pic.twitter.com/UoXbJUQ5lx
— Filmy Bowl (@FilmyBowl) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Huge crowd gathered at Sudarshan 35mm RTC X ROADS For #MaheshBabu#GunturuKaaram #GunturKaraamReview pic.twitter.com/UoXbJUQ5lx
— Filmy Bowl (@FilmyBowl) January 12, 2024Huge crowd gathered at Sudarshan 35mm RTC X ROADS For #MaheshBabu#GunturuKaaram #GunturKaraamReview pic.twitter.com/UoXbJUQ5lx
— Filmy Bowl (@FilmyBowl) January 12, 2024
గుంటూరు కారం సినిమాకు తొలి రోజు దేశవ్యాప్తంగా దాదాపు 11.2 లక్షల టికెట్లు సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.24 కోట్ల గ్రాస్ వసూళ్లు అయ్యాయట. అటు హనుమాన్ సినిమాకు దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే హనుమాన్ మూవీకి స్క్రీన్లు తక్కువగా ఉన్నప్పటికీ ఆ రేంజ్లో ఆడియెన్స్ థియేటర్‌కు రావడం విశేషం. దీంతో ఈ రెండు సినిమాలకు కలిపి ఒక్కరోదే దాదాపు 13 లక్షలకుపైగా జనాలు థియేటర్లకు వచ్చారన్నమాట.
-
Scenes from Sudarshan 70mm screening the Movie #Hanuman
— Sumiran Komarraju (@SumiranKV) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Jai Shri Ram 🚩#HanuManEverywhere pic.twitter.com/neiJ8tOVl2
">Scenes from Sudarshan 70mm screening the Movie #Hanuman
— Sumiran Komarraju (@SumiranKV) January 12, 2024
Jai Shri Ram 🚩#HanuManEverywhere pic.twitter.com/neiJ8tOVl2Scenes from Sudarshan 70mm screening the Movie #Hanuman
— Sumiran Komarraju (@SumiranKV) January 12, 2024
Jai Shri Ram 🚩#HanuManEverywhere pic.twitter.com/neiJ8tOVl2
Mahesh Babu At sudarshan Theatre: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సుదర్శన్ 35MM థియేటర్లో శుక్రవారం గుంటూరు కారం సినిమా చూశారు. మహేశ్‌బాబుతో పాటు ఆయన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, డైరెక్టర్ వంశీ పైడిపళ్లి కూడా ఉన్నారు.
-
Mahesh Babu at His Fort #Sudarshan35MM 🔥🔥pic.twitter.com/wKPE3859uB
— Milagro Movies (@MilagroMovies) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mahesh Babu at His Fort #Sudarshan35MM 🔥🔥pic.twitter.com/wKPE3859uB
— Milagro Movies (@MilagroMovies) January 12, 2024Mahesh Babu at His Fort #Sudarshan35MM 🔥🔥pic.twitter.com/wKPE3859uB
— Milagro Movies (@MilagroMovies) January 12, 2024
రివ్యూ : గుంటూరు కారం - ఆ రెండే హైలైట్స్ - సినిమా ఘాటుగా ఉన్నట్టేనా?
'హనుమాన్' రాంపేజ్ - ప్రశాంత్ వర్మ ఈ రేంజ్ అస్సలు ఉహించలేదయ్యా!