Sankranthi 2024 Movies : ఈ సంక్రాంతి పండగకు టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు నాలుగు సినిమాలు సందడి చేయనున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబో 'గుంటూరు కారం'తో పాటు ప్రశాంత్ వర్మ 'హనుమాన్', విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్', కింగ్ నాగార్జున 'నా సామిరంగ' సినిమాలు ప్రేక్షకుల మందుకు రానున్నాయి. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ రానుండగా జనవరి 13న సైంధవ్, జనవరి 14న నా సామిరంగ చిత్రాలు థియేటర్స్‌లోకి రాబోతున్నాయి.
అయితే విడుదల తేదీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రాల ప్రీ-రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ వివరాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బాగా హైప్ ఉన్న మహేశ్ గుంటూరు కారం సినిమా రూ.135 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. అటు దర్శకుడు త్రివిక్రమ్‌కు ఇటు మహేశ్‌కు ఇద్దరికి మంచి మార్కెట్, డిమాండ్ ఉండటం వల్ల ఈ రేంజ్ బిజినెస్ జరిగింది.
అలాగే వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్, తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ చిత్రాలకు రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్‌గా అంటున్నారు. ఇక 'నా సామి రంగ' సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.18 కోట్లుగా చెబుతున్నారు. కాబట్టి ఈ చిత్రాలన్నీ హిట్ టాక్ అందుకుంటే ఈ సంక్రాంతి బాక్సాఫీస్ సీజన్ మంచి లాభాలు అందుకున్నట్టే.
ఇకపోతే గుంటూరు కారం(Mahesh Babu Guntur Kaaram) చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిందీ సినిమా. హనుమాన్ చిత్రంలో(Prasanth varma Hanuman) అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా కథానాయికలు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, బేబీ సారా కీలక పాత్రలు పోషించారు. నా సామి రంగలో ఆషికా రంగనాథ్ హీరోయిన్. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ఇతర పాత్రల్లో నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'గుంటూరు కారం' - అరే అచ్చం పవన్ సినిమాకు జరిగినట్టే జరుగుతోందిగా!
అప్పుడే ధైర్యం వచ్చింది, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను - మహేశ్ బాబు