ETV Bharat / entertainment

'అలా చెప్పి తనని బాధపెట్టాను - అందుకే ఆమెకు సారీ చెప్పాను' - rashmika mandanna

Sandeep Reddy Vanga Latest Interview : యానిమల్​ సినిమా సక్సెస్​ను ఆస్వాదిస్తున్న డైరెక్టర్ సందీప్​ వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. అందులో భాగంగా బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాకు సారీ చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Sandeep Reddy Vanga Latest Interview
Sandeep Reddy Vanga Latest Interview
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 4:20 PM IST

Updated : Dec 24, 2023, 4:26 PM IST

Sandeep Reddy Vanga Latest Interview : 'యానిమల్' మూవీతో మాసివ్​ సక్సెస్​ను అందుకున్నారు డైరెక్టర్​ సందీప్ రెడ్డి వంగా. ఆయన ఇప్పటి వరకు రెండు సినిమాలే తెరకెక్కించినప్పటీకీ ఆయన సినిమాలకు అభిమానుల్లో క్రేజ్​ మామూలుగా లేదు. అయితే స్టోరీతో పాటు క్యారెక్టర్లను ఎంపిక చేసే విధానం గురించి అభిమానులు నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. హీరో, హీరోయిన్లను ఎంపిక చేసుకునే విషయంలో ఆయనకు ఆయనే సాటి అంటూ కొనియాడుతున్నారు. ఇప్పటికే 'కబీర్‌ సింగ్‌'తో కియారా అడ్వాణీ, 'యానిమల్‌' సినిమా తో రష్మికకు విజయాన్ని అందించారు. అయితే తాజాగా తన హీరోయిన్ల్ ఎంపిక విషయంలో సందీప్‌ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 'కబీర్​ సింగ్​', 'యానిమాల్​' చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రకు తన మొదటి ఛాయిస్‌ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా అంటూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమెతో కలిసి వర్క్‌ చేయడం వీలు కాలేదన్నారు. అంతే కాకుండా 'యానిమల్‌' విషయంలో ఆమెకు సారీ చెప్పానంటూ తెలిపారు.

"పరిణీతి చోప్రా యాక్టింగ్​ అంటే నాకు చాలా ఇష్టం. నా సినిమాల్లో ఆమెను హీరోయిన్‌గా ఎంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 'కబీర్‌ సింగ్‌'లో ప్రీతి పాత్రకు ఆమెనే తీసుకోవాలని మొదట్లో భావించాను. కొన్ని కారణాల వల్ల మేము ఈ సినిమాకు వర్క్​ చేయలేకపోయాం. ఈ విషయం ఆమెకు కూడా తెలుసు. అయితే 'యానిమల్‌'లో హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసుకున్న సమయంలో నాకు సంతోషంగా అనిపించింది. షూట్‌ మొదలు కావడానికి ఏడాదిన్నర ముందే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు సైన్​ చేసింది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని విషయాల పరంగా ఆమెలో నేను గీతాంజలిని (యానిమల్‌లో హీరోయిన్‌ పాత్ర పేరు) చూడలేకపోయాను. ఇదే విషయాన్ని పరిణితీకి చెప్పా. "సారీ. సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదు. అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. 'యానిమల్‌' కోసం మరో హీరోయిన్​ను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా" అని ఆమెతో చెప్పాను. అయితే నా మాటలకు ఆమె ఎంతో బాధపడింది. కానీ నేను ఎందుకు అలా చెప్పానో ఆ తర్వాత అర్థం చేసుకుంది" అని సందీప్‌ తెలిపారు.

మెగాస్టార్​ చిరంజీవితో యాక్షన్​ సినిమా చేస్తా : 'యానిమల్​' డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా

'నేనెప్పుడూ అలా చేయలేదు, చేయను కూడా'- సినీ క్రిటిక్స్​పై సందీప్ ఫైర్!

Last Updated : Dec 24, 2023, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.