ETV Bharat / entertainment

మెగాస్టార్​ చిరంజీవితో యాక్షన్​ సినిమా చేస్తా : 'యానిమల్​' డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా - యానిమల్ సినిమా డైరెక్టర్

Sandeep Reddy Vanga About Chiranjeevi Movie : తెలుగు దర్శకుడు సందీప్​ రెడ్డి వంగ తెరకెక్కించిన 'యానిమల్‌' సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనకు వెళ్లిన సందీప్​ రెడ్డి తెలుగు అగ్రకథానాయకుడు చిరంజీవి గురించి ఆసక్తికర మైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్​తో సినిమా చేస్తానన్నారు. ఇంకా ఏమన్నారంటే?

Sandeep Reddy Vanga About Chiranjeevi Movie

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 5:35 PM IST

Updated : Dec 9, 2023, 5:51 PM IST

Sandeep Reddy Vanga About Chiranjeevi Movie : 'యానిమల్' సినిమాతో బాలీవుడ్​లో సంచలనం సృష్టిస్తున్నారు తెలుగు దర్శకుడు సందీప్​ రెడ్డి వంగ. బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్, రష్మిక మంధాన లీడ్​ రోల్​ తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ సృష్టిస్తోంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సందీప్‌ రెడ్డి తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడి సినీ ప్రియులను కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. అందులో భాగంగా తనకు చిరంజీవితో కలిసి వర్క్‌ చేయాలని ఉందని చెప్పారు. అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవితో ఓ యాక్షన్‌ డ్రామా తెరకెక్కిస్తానని తెలిపారు.

'మీరు సినిమాను సినిమాలాగే చూశారు'
ఆ తర్వాత ఆయన యూఎస్‌ ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటి వరకూ జరిగిన చర్చా కార్యక్రమంలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే సినిమాకు సంబంధించి ఎన్నో విషయాల గురించి నన్ను అడిగారు. నా ఇష్టాయిష్టాలను అడిగి తెలుసుకున్నారు. కానీ, స్త్రీ ద్వేషంపై ఒక్కరు కూడా నన్ను ప్రశ్నించలేదు. ఎందుకంటే, ఇక్కడ ఉన్న వాళ్లందరూ సినిమాని సినిమాలాగే చూశారు. అందుకు నేను ఆనందంగా ఉన్నా' అని చెప్పారు.

  • What I really like about the crowd is that I didn't hear any questions on misogyny. I'm so happy, you are the right crowd. You saw #Animal just as a film - Sandeep Reddy Vanga pic.twitter.com/cChYivMn49

    — RKᴬ (@seeuatthemovie) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Animal Movie Cast : ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీకొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ఈ చిత్రంలో రణ్​బీర్​ కపూర్​తో పాటు రష్మిక మందన్న, తృప్తి డిమ్రి, బాబీ దేఓల్​, అనిల్‌ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి తన మార్క్ డైరెక్షన్​తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. మాస్​ యాక్షన్​ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో మరింత హైప్​ను పెంచారు. ఇక సినిమా పాటలు కూడా హిట్ అయ్యాయి. మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్​ యానిమల్​కు 'A' సర్టిఫికేట్ ఇచ్చింది. అయినా బాక్సాఫీసు ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ట్రెండీ డ్రెస్సు​​లో బాలీవుడ్​ భామ- కిల్లింగ్​ లుక్స్​తో కృతి సనన్ ఫోజులు!

ప్రపంచంలోనే టాప్​ 10 రిచెస్ట్ యాక్టర్లు వీరే- భారత్​ నుంచి ఎవరు ఉన్నారంటే?

Last Updated : Dec 9, 2023, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.