Samantha Chinmayi Children : స్టార్ నటి సమంత.. తన స్నేహితురాలు, సింగర్ చిన్మయి ఇంట సందడి చేశారు. చిన్మయి కవల పిల్లలతో సరాదాగా ఆడిపాడారు. ఇండోనేసియా నుంచి తిరిగిరాగానే చెన్నైలోని చిన్మయి ఇంటికి వెళ్లిన సామ్.. ఇద్దరు పిల్లలతో కలిసి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సామ్.. తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.
అయితే చిన్మయి, ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్.. ఇద్దరూ సమంతకు మంచి స్నేహితులు. ఆమె నటించిన అనేక సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. రాహుల్ రవీంద్రన్తో కలిసి సామ్ పలు సినిమాల్లో నటించారు. తాజాగా వీళ్ల ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసి సమంత సరదాగా గడిపారు. ఆ చిన్నారులతో ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటుకు డ్యాన్స్ వేయించారు. అలాగే పిల్లలతో పోటీ పడుతూ ఆడారు. అందుకు సంబంధించి వీడియో.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను రాహుల్ రవీంద్రన్ తీసినట్లు అర్థమవుతోంది.
-
Always a Child 🤍🥹
— SAM ARMY || KnowUrStarSAM™ (@KnowUrStarSAM) August 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Our Cutie @Samanthaprabhu2 with @Chinmayi & @23_rahulr kids ❤️🫶#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/itrPdoB1H7
">Always a Child 🤍🥹
— SAM ARMY || KnowUrStarSAM™ (@KnowUrStarSAM) August 6, 2023
Our Cutie @Samanthaprabhu2 with @Chinmayi & @23_rahulr kids ❤️🫶#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/itrPdoB1H7Always a Child 🤍🥹
— SAM ARMY || KnowUrStarSAM™ (@KnowUrStarSAM) August 6, 2023
Our Cutie @Samanthaprabhu2 with @Chinmayi & @23_rahulr kids ❤️🫶#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/itrPdoB1H7
కాగా.. మయోసైటిస్ వ్యాధి బారినపడి కోలుకున్న సమంత.. కొన్నిరోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్‌తో కలిసి చేసిన సిటాడెల్ వెబ్‌సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.
గతేడాది జూన్‌లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయి, ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్నారుల చేతులను ఫొటో తీసి, దాన్ని నెట్టింట షేర్ చేశారు. "ద్రిప్త, శర్వస్... మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చినా, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు" అని రాసుకొచ్చారు. ఒకే పరిశ్రమలో వేర్వేరు విభాగాలకు చెందిన చిన్మయి, రవీంద్రన్‌కు కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడిన వీరు.. తమ బంధం గురించి ఇరు కుటుంబాల్లో చెప్పి.. పెద్దల అంగీకారంతో 2014లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.