ETV Bharat / entertainment

పవన్ కల్యాణ్ హిట్​ మూవీని సల్మాన్​ ఖాన్​ రీమేక్ చేస్తున్నారా?

author img

By

Published : Sep 14, 2022, 9:45 AM IST

Updated : Sep 14, 2022, 9:54 AM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ నటిస్తున్న తాజా చిత్రం.. పవన్​కల్యాణ్​ నటించిన ఓ హిట్​ సినిమాకు రీమేక్​ అని తెలుస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..

salman khan
సల్మాన్​ ఖాన్​

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే పలు దక్షిణాది చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. వీటితో ఎన్నో సూపర్​ హిట్స్​ను కూడా అందుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం కిసీ కా భాయ్​ కిసీ కా జాన్​. పూజాహెగ్డే హీరోయిన్​. వెంకటేశ్​ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ ఓ సౌత్​ హిట్​ ఫిల్మ్​కు రీమేక్​ అని గతంలో ప్రచారం సాగింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... ఇది 'వీరమ్' సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది. తెలుగులో పవన్​కల్యాణ్​ 'కాటమరాయుడు' పేరుతో రీమేక్ చేశారు. శ్రుతిహాసన్​ హీరోయిన్​. ఇందులో నలుగురు తమ్ముళ్లకి అన్నయ్యగా పవన్‌ అభిమానులను అలరించారు. ఈ కథనే మార్పులు చేసి హిందీలో భాయ్​ నటిస్తున్నారని ప్రస్తుతం సినీ వర్గాల టాక్​. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్​ విడుదలై ఆకట్టుకుంది. ఇందులో సల్మాన్​ లాంగ్​ హెయిర్​తో ఎడారిలో నడుచుకుంటూ స్టైలిష్​గా కనిపించి ఫ్యాన్స్​ను ఫిదా చేశారు.

ఇక సల్మాన్​.. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి నటిస్తున్న గాడ్​ఫాదర్​లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్​ ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో భాయ్​.. చిరుతో కలిసి వేసిన స్టెప్పులు అభిమానులను అలరిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'ఓటీటీల వల్ల నష్టం లేదు.. కానీ ఆ పని చేయకుంటే అంతే సంగతి!'

Last Updated : Sep 14, 2022, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.