ETV Bharat / entertainment

Salaar VS Jawaan : సెప్టెంబర్​పైనే ఆశలు.. అన్ని కలిసొస్తే రూ.2వేల కోట్లు పక్కా! - షారుక్ ఖాన్ జవాన్ విడుదల తేది

Salaar VS Jawaan : ఇండియన్ బాక్సాఫీస్​కు సెప్టెంబర్​ నెల అత్యంత కీలకం కానుంది. ఈ నెలలోనే 'సలార్ వర్సెస్​ జవాన్'​గా ప్రభాస్-షారుక్ బాక్సాఫీస్​ ముందు పోరుకు దిగనున్నారు. ఆ వివరాలు..

Salaar VS Jawaan
సలార్ వర్సెస్​ జవాన్
author img

By

Published : Jul 10, 2023, 2:00 PM IST

Updated : Jul 10, 2023, 3:13 PM IST

Salaar VS Jawaan : ప్రభాస్ వర్సెస్​ షారుక్​ వార్​.. మొదలైపోయింది. బాక్సాఫీస్​ను ఎవరు షేక్ చేస్తారు? ఎవరు రూ.1000కోట్ల కుంభస్థలాన్ని బద్దలు కొడతారు? లేదంటే ఇద్దరూ కలిసే రూ.2 వేల కోట్లను అందుకుంటారా? అనే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, అభిమానుల మదిలో తెగ తిరిగేస్తున్నాయి. ఎందుకంటే తాజాగా జులై 10న 'జవాన్​' ప్రివ్యూ పేరుతో ఓ పవర్​ఫుల్​ గ్లింప్స్ రిలీజై అభిమానుల్లో గుస్​బంప్స్ తెప్పించింది. దీంతో సినిమా​ బ్లాక్ బాస్టర్​ అవ్వడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

సలార్​కు కూడా సూపర్ రెస్పాన్స్​.. అయితే నాలుగు రోజుల క్రితం ప్రభాస్ 'సలార్​' యాక్షన్​ టీజర్​ కూడా విడుదలై సోషల్​మీడియాలో ఊహించని రేంజ్​లో రెస్పాన్స్ అందుకుంది.100 మిలియన్లకు పైగా వ్యూస్​ను అందుకుంది. ఇది చూసిన అభిమానులు.. బాక్సాఫీస్​ షేక్ అవ్వడం పక్కా అని అభిప్రాయపడుతున్నారు. అలా ఈ రెండు టీజర్లకు కళ్లు చెదిరే రేంజ్​లో ట్రెమండస్​ రెస్పాన్స్ రావడంతో.. ఇప్పడది 'సలార్ వర్సెస్​ జవాన్'​, 'షారుక్ వర్సెస్​ ప్రభాస్'​గా మారిపోయింది.

సెప్టెంబర్​ అత్యంత కీలకం.. ఈ రెండు చిత్రాలు పవర్​ఫుల్ యాక్షన్​ డ్రామాగా రూపొందడం, అందులోను షారుక్- ప్రభాస్ లాంటి ఇద్దరూ​ భారీ అభిమానగణం ఉన్న పాన్ ఇండియా స్టార్స్ కావడం వల్ల ముందు నుంచే సినిమాపై అదిరిపోయే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడీ ఈ రెండు చిత్రాలు సెప్టెంబరులోనే రిలీజ్ అవ్వడం మరో విశేషం. షారుక్ జవాన్​ సెప్టంబరు 7న భారీ స్థాయిలో రిలీజ్ కానుండగా... సలార్ సెప్టెంబరు 28న భారీ రేంజ్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఫ్యాన్స్​ 'జవాన్ వర్సెస్​ సలార్'​, 'షారుక్ వర్సెస్​ ప్రభాస్'​ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. రెండు చిత్రాలు.. బాక్సాఫీస్​ ముందు చెరో రూ.1000కోట్లు సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అనుకున్నట్టు జరిగితే ఒక్క సెప్టెంబర్​లో నెలలోనే ఇండియన్​ బాక్సాఫీస్​ ఖాతాలోకి రూ.2 వేల కోట్లు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ సెప్టెంబర్​ నెల బాక్సాఫీస్​కు అత్యంత కీలకం కానుంది. ఆశలన్నీ ఈ నెలపై ఉన్నాయి.

ఇకపోతే ఇప్పటికే షారుక్​ 'పఠాన్​' సినిమాతో బాక్సాఫీస్​ ముందు వెయ్యి కోట్లు సాధించారు. బాలీవుడ్​కు పూర్వవైభవం అందించారు. ఇంతటి బ్లాక్​ బాస్టర్​ హిట్​ తర్వాత 'జవాన్' చిత్రం రావడం వల్ల.. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు టీజర్​తో అది తారాస్థాయికి చేరుకుంది. ఇక ప్రభాస్ సాహో, రాధేశ్యామ్​, ఆదిపురుష్​ వరుస ఫ్లాప్​లతో డీలా పడినా... మార్కెట్, క్రేజీ ఏమీ తగ్గలేదు. 'సలార్' యాక్షన్​ టీజర్​తో బాక్సాఫీస్​ షేక్ అనే నమ్మకాన్ని కలిగించారు. చూడాలి మరి ఈ సెప్టెంబర్​.. ఇండియన్​ బాక్సాఫీస్ కు ఎలా కలిసొస్తుందో? ఈ రెండూ కలిపి చెరో రూ.1000కోట్లు అంటే రూ.2 వేల కోట్లు అందిస్తాయో లేదో..

Last Updated : Jul 10, 2023, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.