ETV Bharat / entertainment

Salaar Vs Dunki : 'సలార్​' దెబ్బ.. 'డంకీ' అబ్బా.. షారుక్ కొత్త మూవీ రిలీజ్​ వాయిదా! - Prabhas

Salaar vs Dunki : 'సలార్' మువీ రిలీజ్​ డేట్​ ఫిక్స్​ అయిన తర్వాత పలు పాన్ ఇండియా సినిమాలు తమ విడుదల తేదీని మార్చుకునేందుకు ప్లాన్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'డంకీ' కూడా వెనక్కి తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలు మీ కోసం..

Salaar vs Dunki
Salaar vs Dunki
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 1:25 PM IST

Updated : Oct 13, 2023, 1:31 PM IST

Salaar vs Dunki : గత కొన్ని రోజులుగా నెట్టింట 'సలార్​' సినిమా రిలీజ్​ డేట్​ గురించి చర్చలు జరుగుతున్నాయి. సెప్టెంబర్​లో విడుదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడి.. ఎట్టకేలకు డిసెంబర్​లో విడుదల కానుందంటూ మేకర్స్​ క్లారిటీ ఇచ్చారు. అయితే అదే సమయంలో షారుక్ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'డంకీ' మూవీ కూడా రిలీజయ్యేందుకు సన్నాహకాలు జరిగాయి. వాస్తవానికి షారుక్.. ఈ సినిమా క్రిస్మస్​ లేదా న్యూ ఇయర్​కు థియేటర్లలో రానుందంటూ చెప్పారు. అయితే అఫీషియల్​ డేట్​ను మాత్రం చెప్పలేదు. ఆ తర్వాతనే 'సలార్'​ సినిమా రిలీజ్​ డేట్​ను మూవీ మేకర్స్​ అనౌన్స్​ చేశారు. దీంతో నెట్టింట ఫ్యాన్​ వార్​ మొదలైంది.

రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజైతే ఏదో ఒక సినిమా భారీగా దెబ్బతినే అవకాశాలున్నాయంటూ అటు ప్రభాస్​తో పాటు ఇటు షారుక్ ఫ్యాన్స్​ సోషల్ మీడియాలో డిస్కషన్​ పెట్టడం మొదలెట్టారు. అయితే ఈ విషయంపై అటు 'సలార్​' ఇటు 'డంకీ' మేకర్స్​ ఏ మేరకు స్పందించలేదు. దీంతో ఈ రెండు సినిమాలు కచ్చితంగా క్లాష్​ అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ ట్రెండ్​ అవుతోంది. దీని ప్రకారం 'డంకీ' వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

Dunki Movie Release Date : తాజా సమాచారం ప్రకారం 'డంకీ'ని వాయిదా వేసే అవకాశం ఉందట. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలో​ అఫీషియల్​గా అనౌన్స్​ చేయనున్నారట. దీని పలువురు సినీ విశ్లేషకులు సైతం ట్వీట్స్​ చేశారు. అయితే 'డంకీ' చిత్ర బృందం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఫ్యాన్స్​ కన్​ఫ్యూజన్​లో పడిపోయారు. అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చేంతవరకు వెయిట్​ చేద్దామంటూ కామెంట్లు పెడుతున్నారు.

Christmas Release Movies 2023 Tollywood : ఇక 'సలార్' కొత్త రిలీజ్ డేట్ వార్త.. ఇతర టాలీవుడ్ సినిమాలకు పెద్ద షాకిచ్చింది. డిసెంబర్​లో రిలీజ్​ చేయాలనుకున్న 'హాయ్ నాన్న',​ 'సైంధవ్', సుధీర్ బాబు 'హరోం హర' , నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలు వెనక్కితగ్గాయి. కొన్ని సినిమాలు కొత్త డేట్స్​ను చెప్పగా.. మరికొన్ని ఇంకా అనౌన్స్​ చేయలేదు.

Salaar Ugramm Remake : 'సలార్'​.. ఉగ్రమ్ రీమేక్ ప్రచారంలో నిజమెంత?

NTR Cameo role : 'సలార్'​ - 'టైగర్​ 3'లో ఎన్టీఆర్​ గెస్ట్​ రోల్స్​.. నిజమెంత?

Last Updated : Oct 13, 2023, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.