Salaar Vs Dunki Advance Booking : ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి ఒక్కరోజు గ్యాప్‌లో 'సలార్', 'డంకీ' సినిమాలు రానున్నాయి. భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న ఈ సినిమాలకు విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్తోపాటు భారత్‌లోనూ అడ్వాన్స్డ్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెబల్‌స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇమేజ్‌తో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్మడవుతున్నాయి. మరి దేశవ్యాప్తంగా ఆడ్వాన్స్ బుకింగ్స్‌లో ఏ సినిమా ఎంత కలెక్షన్లు చేసిందంటే?
సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ : 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారత్‌లో ఇప్పటివరకు రూ. 1.55 కోట్లు కలెక్షన్లు వసూల్ చేసింది. అందులో ఒక తెలుగులోనే ఏకంగా రూ. 1.1 కోట్లు రాగా, మలయాళంలో రూ. 35.3 లక్షలు, కన్నడలో రూ. 28.3 లక్షలు, తమిళలో రూ. 23.3 లక్షలు వసూలయ్యాయి. ఇక హిందీలో (రూ. 5.7 లక్షలు) ఓపెనింగ్ రోజు 350 షో లకుగాను 2303 టికెట్లు బుక్ అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 75,817 టికెట్లు సోల్డ్ అయ్యాయి.
నార్త్ ఇండియా సేల్స్ స్టార్ట్ : 'సలార్' సినిమా బుకింగ్స్ నార్త్ ఇండియాలోనూ ఆదివారం (డిసెంబర్ 17) ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా తెలిపింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
-
The wait is over 💥
— Hombale Films (@hombalefilms) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Bookings now open for #SalaarCeaseFire across North India
🎟️ https://t.co/pntZsatfYO#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84 @vchalapathi_art… pic.twitter.com/4aidufpmPJ
">The wait is over 💥
— Hombale Films (@hombalefilms) December 17, 2023
Bookings now open for #SalaarCeaseFire across North India
🎟️ https://t.co/pntZsatfYO#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84 @vchalapathi_art… pic.twitter.com/4aidufpmPJThe wait is over 💥
— Hombale Films (@hombalefilms) December 17, 2023
Bookings now open for #SalaarCeaseFire across North India
🎟️ https://t.co/pntZsatfYO#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84 @vchalapathi_art… pic.twitter.com/4aidufpmPJ
డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ : 2023లో 'డంకీ'తో ముచ్చటగా మూడోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు షారుఖ్ ఖాన్. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1.44 కోట్లు వసూల్ చేసింది. 'డంకీ' తొలిరోజు ఒక్క హిందీలోనే 3,126 షో లకుగాను 39,954 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక రిలీజ్‌కు ఇంకా కొంత సమయం ఉండడం వల్ల సేల్స్ పేరిగే అవకాశం లేకపోలేదు. కాగా, డిసెంబర్ 21న 'డంకీ' గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
-
#Dunki Initial Pre Sale starts on a REMARKABLE NOTE
— Sumit Kadel (@SumitkadeI) December 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Film has sold 10K +tickets at National Chain Plexes.. Non National Chains showing good movement too.
If the momentum continues then #Dunki will challenge Top Films of 2023 in terms of Final Advance Booking. Next 3 days will… pic.twitter.com/RHe8DnrrDK
">#Dunki Initial Pre Sale starts on a REMARKABLE NOTE
— Sumit Kadel (@SumitkadeI) December 16, 2023
Film has sold 10K +tickets at National Chain Plexes.. Non National Chains showing good movement too.
If the momentum continues then #Dunki will challenge Top Films of 2023 in terms of Final Advance Booking. Next 3 days will… pic.twitter.com/RHe8DnrrDK#Dunki Initial Pre Sale starts on a REMARKABLE NOTE
— Sumit Kadel (@SumitkadeI) December 16, 2023
Film has sold 10K +tickets at National Chain Plexes.. Non National Chains showing good movement too.
If the momentum continues then #Dunki will challenge Top Films of 2023 in terms of Final Advance Booking. Next 3 days will… pic.twitter.com/RHe8DnrrDK
సలార్ వర్సెస్ డంకీ : అయితే 'సలార్'తో పోలిస్తే, భారత్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'డంకీ' కాస్త తక్కువ కలెక్షన్లు సాధించిందనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'సలార్' రూ. 1.55 వసూల్ చేయగా 'డంకీ' రూ. 1.44 కలెక్షన్లు సాధించింది. డిసెంబర్ 21న 'డంకీ' గ్రాండ్‌గా రిలీజ్ కాగా, 'సలార్' మరుసటి రోజు (డిసెంబర్ 22) ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Salaar Vs Dunki : స్టార్ హీరోలకు బిగ్ షాక్.. ఓవర్సీస్ బరిలోకి 'ఆక్వామన్' మూవీ
Salaar Vs Dunki : 'సలార్' దెబ్బ.. 'డంకీ' అబ్బా.. షారుక్ కొత్త మూవీ రిలీజ్ వాయిదా!