Salaar Trailer Update : : రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ బడ్జెట్‌తో 'సలార్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే ఈ సినిమా ట్రైలర్ గురించి.. డార్లింగ్స్ ఫ్యాన్స్‌కు ఫుల్కిక్ ఇచ్చే అప్డేట్ వచ్చింది.
సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 1న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు.. బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్ష్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ ట్వీట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే తరణ్ ఆదర్ష్.. రిలీజ్ డేట్ గురించి చెప్పినప్పటికీ..మూవీటీమ్ నుంచి మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఈగర్లీ వెయిటింగ్ ..
ట్రైలర్ గురించి సినీ క్రిటిక్ ఇచ్చిన అప్డేట్ను సినిమా సన్నిహిత వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు మూవీ నుంచి స్టిల్స్, చిన్నపాటి గ్లింప్స్ వీడియోను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక మరో మూడు వారాల్లో 'సలార్' ట్రైలర్ విడుదల కానుండంటంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ట్రైలర్ వస్తే.. డైనోసార్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
-
PRABHAS: ‘SALAAR’ NO POSTPONEMENT… TRAILER ON 1 DEC… #Salaar arrives in *cinemas* on 22 Dec 2023 #Christmas2023… Get ready for #SalaarTrailer.#Prabhas #PrithvirajSukumaran #PrashanthNeel #VijayKiragandur pic.twitter.com/L6KhQw8Tzk
— taran adarsh (@taran_adarsh) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PRABHAS: ‘SALAAR’ NO POSTPONEMENT… TRAILER ON 1 DEC… #Salaar arrives in *cinemas* on 22 Dec 2023 #Christmas2023… Get ready for #SalaarTrailer.#Prabhas #PrithvirajSukumaran #PrashanthNeel #VijayKiragandur pic.twitter.com/L6KhQw8Tzk
— taran adarsh (@taran_adarsh) November 9, 2023PRABHAS: ‘SALAAR’ NO POSTPONEMENT… TRAILER ON 1 DEC… #Salaar arrives in *cinemas* on 22 Dec 2023 #Christmas2023… Get ready for #SalaarTrailer.#Prabhas #PrithvirajSukumaran #PrashanthNeel #VijayKiragandur pic.twitter.com/L6KhQw8Tzk
— taran adarsh (@taran_adarsh) November 9, 2023
బ్యాక్ టు హైదరాబాద్..
క్రిస్మస్ కానుకగా 'సలార్'ను డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీటీమ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, గతకొన్ని రోజులుగా యూరప్ ట్రిప్‌లో ఉన్న ప్రభాస్ బుధవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. డార్లింగ్ కమ్ బ్యాక్‌తో సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 'సలార్' సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు.
'యానిమల్'షో ఇంటర్వెల్లో 'సలార్' ట్రైలర్?
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం 'యానిమల్'. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ హీరో నటించారు. ఈయనకు జోడీగా రష్మిక మందన్నా ఆడిపాడింది. ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ షో ఇంటర్వెల్ సమయంలోనే 'సలార్' ట్రైలర్‌ను విడుదలే చేసే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ వీధుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
షారుక్ 'డంకీ' ఎఫెక్ట్ 'సలార్'పై ఉంటుందా?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'డంకీ'. ఈ సినిమా కూడా 'సలార్' విడుదల రోజే రిలీజ్ అవుతుంది. అయితే వాస్తవానికి 'సలార్' టీమ్ కన్నా ముందే 'డంకీ' దర్శకులు రాజ్ కుమార్ హిరాణీ తమ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. దాని ప్రకారమే రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి 'సలార్' మాత్రం సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలతో అది వాయిదా పడి షారుక్ సినిమాతో పాటు పోటీలోకి దిగనుంది. దీంతో ఇద్దరూ బడా హీరోల సినిమాలు బాక్సాఫీస్ పోటీపడనున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రభాస్ ఈజ్ బ్యాక్ - ఇక 'సలార్' సందడి షురూ!
సల్మాన్ ఖాన్ 'టైగర్-3'కు మరాఠి సినిమా సవాల్! - డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా?