ETV Bharat / entertainment

'సలార్​' టీమ్​తో రాజమౌళి స్పెషల్​ ఇంటర్వ్యూ​ - ఫుల్​ వీడియో రిలీజ్ - Salaar Team Special interview

Salaar Team Special Interview With Rajamouli : ప్రశాంత్​ నీల్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూమీ టీమ్​ను రాజమౌళితో ఇంటర్వ్యూ చేశారు. తాజాగా మూవీ మేకర్స్ ఆ వీడియోను విడుదల చేశారు.

Salaar Team Special Interview With Rajamouli

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 6:50 PM IST

Updated : Dec 20, 2023, 11:34 PM IST

Salaar Team Special Interview With Rajamouli : రెబల్​ స్టార్ ప్రభాస్​, 'కేజీఎఫ్'​ ఫేమ్​ ప్రశాంత్​ నీల్ కాంబినేషన్​లో రానున్న సినిమా 'సలార్'. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. వర్డల్​ వైడ్​గా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్​ సుకుమారన్​ను ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల ఆ ఇంటర్వ్యూ ప్రోమోను మేకర్స్ రిలీజ్​ చేశారు. తాజాగా పూర్తి వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కేజీఎఫ్​, సలార్, బాహుబలి సినిమాలు, వాటి మేకింగ్స్, ప్రభాస్​, సలార్​ సెట్​లో జరిగిన సంఘటనలు గురించి ఇలా అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూలో ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

'సలార్​' టీమ్​తో రాజమౌళి స్పెషల్​ ఇంటర్వ్యూ

ఇప్పటివరకు ఇలాంటి వ్యక్తి చూడలేదు
పృథ్వీరాజ్​ చాలా టాలెంటెడ్ అని ప్రభాస్ అన్నారు." పృథ్వీరాజ్​ దర్శకుడిగా, యాక్టర్​గా అనేక విజయాలు అందుకున్నారు. అలానే సెట్​లో చివరి నిమిషంలో ప్రశాంత్ నీల్​ డైలాగ్​లో మార్పు చేసినా పృథ్వీ, వెంటనే పట్టేస్తారు. ఆయన టాలెంట్​ అక్కడే అర్థమౌతుంది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు సెట్​లో కూల్​గా ఉండే యాక్టర్​ను నేను ఇప్పటివరకు చూడలేదు. అందుకే శ్రుతిహాసన్​ కంటే పృథ్వీరాజ్​ను ఎక్కువగా ప్రేమిస్తా" అని ప్రభాస్ అన్నారు.

డైట్​ చాలా కష్టం
ప్రభాస్​తో వర్క్ చేస్తే డైట్​ చేయటం చాలా కష్టమని పృథ్వీరాజ్​ అన్నారు. 'ఆయన ఎంతో సరదాగా ఉంటారు. సలార్​ షూట్​లో ఉన్నప్పుడు ఓ రోజు నా భార్య, కుమార్తె సెట్​కు వచ్చారు. మా కోసం ఆయన పంపిన ఫుడ్​ను స్టోర్​ చేయడానికి ఆ రోజు నేను ఎక్స్​ట్రా రూమ్​ తీసుకోవాల్సి వచ్చింది.' అని పృథ్వీరాజ్​ తెలిపారు.

సోషల్​ మీడియా అకౌంట్​ డిలీట్​
'నా భార్య సోషల్​ మీడియాలో నాకు ఓ అకౌంట్​ క్రియేట్​ చేసింది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్​ వల్ల ఎఫెక్ట్​ అవ్వకూడదని ఆ అకౌంట్​ను డిలీట్​ చేశా. అది 'కేజీయఫ్‌ -2' సినిమా విడుదలయ్యాకే డిసైడ్ అయ్యా. చాలా మంది ఆ చిత్రాన్ని ప్రశంసించి, ఎవరో ఒక్కరు తిట్టినా అది నన్నెంతో బాధిస్తుంది. అందుకే సోషల్​ మీడియాకు దూరంగా ఉంటున్నా.' అని ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు.

సలార్​ దెబ్బకు Book My Show సర్వర్లు క్రాష్- ఏమన్నా క్రేజా ఇది?

'సలార్' టికెట్​ ధరల పెంపు- తెలంగాణలో మల్టీప్లెక్స్​కు రూ.100- ఏపీలో ఎంతంటే?

Last Updated : Dec 20, 2023, 11:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.