ETV Bharat / entertainment

Salaar Shooting : 'సలార్' షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదా?.. ఇదేం కొత్త ట్విస్ట్​ భయ్యా!​.. కొత్త షెడ్యూల్​ షురూ చేశారట - salaar movie shooting patch work

Salaar Shooting : పూర్తి అయిపోయిందని అనుకున్న ప్రభాస్ సలార్ షూటింగ్ మళ్లీ మొదలైనట్లు తెలిసింది. మూవీటీమ్​ ప్యాచ్​ వర్క్​ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఆ వివరాలు..

Salaar Shooting : 'సలార్' షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదా.. కొత్త షెడ్యూల్​కు ప్లాన్​.. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు బాసూ?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 1:24 PM IST

Updated : Sep 25, 2023, 2:01 PM IST

Salaar Shooting : అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే మరో మూడు రోజుల్లో థియేటర్లన్నీ సలార్​ యాక్షన్ బ్లాక్​తో దద్దరిల్లిపోయేవి. ఇండియన్​ బాక్సాఫీస్ షేక్ అయ్యేది. కానీ పరిస్థితులు తారుమరైపోయి... సినిమా వాయిదా పడి.. ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టత లేకుండా పోయింది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్​ డిలే అవ్వడం వల్లే వాయిదా వేస్తున్నట్లు, మరింత మంచి క్వాలిటీ ఔట్ పుట్ ఇస్తామని చెప్పి మేకర్స్ సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. ఎనిమిది రోజుల షెడ్యూల్​ చిత్రీకరణను ప్రారంభించారని హైదారాబాద్​లోనే జరుగుతోందట. అయితే ప్రభాస్​కు సంబంధించిన సీన్స్​ లేకుండా షూట్ చేస్తున్నారట.

ఇక ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్, సినీ ప్రియులు.. ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్​ కాలేదా? అయిపోయిందని అన్నారు కదా.. ఎందుకిలా చేస్తున్నారంటూ నిరుత్సాహ పడుతున్నారు. కానీ ఇది ప్యాచ్​ వర్క్ లాంటిదే. ఏ చిత్రానికైనా మంచి ఔట్​ పుట్​ కోసం ఇలాంటి అప్పుడప్పుడు జరగడం సర్వసాధారణం. ప్రేక్షకుల అంచనాలను మించేలా.. మరింత మంచి క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే​ ఈ ప్యాచ్ వర్క్ జరుగుతోందని అర్థమవుతోంది.

ఇకపోతే ఈ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేసే అవకాశం లేదని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వచ్చే ఏడాదిలోనే విడుదల అవుతుందని పలు రకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. డైరెక్టర్​ ప్రశాంత్ నీల్​.. ఇండియా వైడ్​గా ఏ చిత్రాలు రిలీజ్​ కానీ సమయం చూసి సోలో రిలీజ్ చేయాలని సన్నాహుల చేస్తున్నారని సమాచారం అందింది. చూడాలి మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో..

కాగా, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై మరిన్ని భారీ అంచనాలను పెంచింది. హీరోని ఎలివేట్‌ చేస్తూ వచ్చిన సింపుల్​ డైలాగ్స్‌, యాక్షన్‌ విజువల్స్‌ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ హీరోయిన్​ నటిస్తోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

September Last Week Movies 2023 : ఈ వారం సినిమాల జాతర.. 16 చిత్రాలు, 8 వెబ్​ సిరీస్​లు.. ఆ మూడింటిపైనే భారీ అంచనాలు

Prabhas Sreeleela Movie : ప్రభాస్ సరసన శ్రీలీల!.. దర్శకుడు అతడే.. సినిమా ఎప్పుడు ప్రారంభం అంటే?

Last Updated : Sep 25, 2023, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.