ETV Bharat / entertainment

వైలెంట్​గా 'సలార్' సెకండ్ ట్రైలర్- ప్రభాస్ డైలాగ్స్​కు గూస్​బంప్సే! - సలార్​ సెకండ్ ట్రైలర్

Salaar Release Trailer Telugu : ప్రభాస్​- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్​ మూవీ సెకండ్ ట్రైలర్​ను మేకర్స్​ రిలీజ్ చేశారు. మీరు చూశారా?

salaar release trailer telugu
salaar release trailer telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 3:45 PM IST

Updated : Dec 18, 2023, 4:03 PM IST

Salaar Release Trailer Telugu : పాన్ ​ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సలార్'. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అంటే ఇంకా వారం రోజులు కూడా లేదన్న మాట. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్​ జోరు పెంచింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్, సినిమాలో విలన్‌గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్‌లను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు. తాజాగా రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో వీడియోను విడుదల చేశారు. పూర్తిగా వైలెన్స్​తో కూడిన ఈ ట్రైలర్​ను మీరు చూశారా?

ఈ ట్రైలర్​లో పూర్తిగా హీరో ప్రభాస్, పృథ్వీరాజ్​ను చూపించారు. తొలి ట్రైలర్​ కంటే మరింత వైలెన్స్​తో ప్రభాస్​కు ఎలివేషన్స్ ఇచ్చారు. ఈ వీడియోలో ప్రభాస్ డైలాగ్స్ ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 'ఖాన్సార్ ఎరుపెక్కాలా' అనేే డైలాగ్ గూస్​బంప్స్​ తెప్పిస్తోంది. ఇక హీరోయిన్ శ్రుతి హాసన్​కు కూడా ఈ వీడియోలో స్క్రీన్ టైమ్ ఇచ్చారు. ఇక మొత్తంగా ఫైనల్ టచ్ అదిరిపోయిందంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. డిసెంబర్ 22న థియేటర్లలో మాస్ జాతరే అంటున్నారు.

జోరుగా ప్రమోషన్లు! :మరోవైపు భారీ అంచనాల మధ్య విడుదల కానున్న సలార్ ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. చిత్రబృందం అంచనాలను మరింత పెంచడానికే ట్రై చేస్తుంది. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో సలార్ ఉండనుందని చెప్పారు. ఇందులో క్యారెక్టర్ డైనమిక్స్ చాలా అద్భుతంగా ఉండనున్నాయని తెలిపారు. సలార్​లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ముంబయిలో ప్రభాస్ కటౌట్ :​ తాజాగా సలార్ సినిమాకు సంబంధించి ప్రభాస్ 120 అడుగుల భారీ కటౌట్​ను ముంబయిలో పెట్టారు. ఠానేలోని R మాల్ ముందు పెట్టిన ఈ 120 అడుగుల భారీ కటౌట్ అక్కడి ఆడియన్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ కటౌట్​కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి. దీన్ని బట్టి నార్త్​లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్​లో ఉందో స్పష్టమవుతోంది.

రూ.1000 కోట్లు పక్కా! కేజీఎఫ్, కాంతార వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్స్మ్ సలార్ మూవీని నిర్మించింది. సినిమాలో ప్రభాస్‌తో పాటు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, ఈశ్వరి రావు, శరణ్ శక్తి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు వసూలు చేయడం పక్కా అని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

క్రిస్మస్​ స్పెషల్​- బాక్సాఫీస్​ వద్ద సినిమాల భారీ హంగామా- మీరు రెడీనా?

అడ్వాన్స్ బుకింగ్స్​లో 'సలార్​'దే జోరు- రేస్​లో వెనకబడ్డ 'డంకీ'

Last Updated : Dec 18, 2023, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.