Salaar Promotion : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్ స్టర్ సినిమా 'సలార్'. మరో 27 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా మూవీటీమ్ టీమ్ మాత్రం ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా సైలెంట్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగిస్తోంది!
అయితే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సలార్ మేకర్స్ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ఎటువంటి ప్రమోషన్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారట. ఈవెంట్లు కూడా నిర్వహించరని సమాచారం అందింది. సినిమా విడుదల సమయంలోపు కేవలం ఓ ట్రైలర్‌ను, ఆ తర్వాత ఒకటి లేదా రెండు పాటలను మాత్రమే విడుదల చేస్తారని తెలిసింది. అయితే ఇలా చేయడానికి కారణం కాన్ఫిడెన్స్ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ స్థాయిలో విశేష స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా పక్కా హిట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అలాగే ప్రభాస్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాతలు కూడా.. తమ సినిమా ఔట్‌పుట్‌పై అంతే భారీ నమ్మకంతో ఉన్నారట. ఉన్నారట. సినిమా హిట్ అవ్వడం గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారని తెలిసింది. అందుకే ఎటువంటి ప్రమోషన్స్, ఈవెంట్లు లేకుండానే సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో..
Salaar USA Booking : ఓవర్సీస్లో జోరు.. ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పుటికే మొదలైన యూఎస్ బుకింగ్స్ లెక్కలు చూస్తుంటే భారీ ఓపెనింగ్స్ దక్కుతాయని అంచనా వేస్తున్నారు. గతంలో యూఎస్ బాక్సాఫీస్ ముందు 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల పరంగా.. ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి దాదాపు రూ.5.5 మిలియన్ డాల్లర కలెక్షన్లను అందుకుంది.
అయితే ఇప్పుడు సలార్.. యూఎస్ బాక్సాఫీస్ ముందు సెప్టెంబర్ 27న ప్రీమియర్స్‌కు రెడీ అయింది. ఇప్పటికే 500కే డాలర్ల వరకు బుకింగ్స్ సేల్స్ అయ్యాయట. ఇదే జోరు కంటిన్యూ అయితే మూడు నుంచి నాలుగు మిలియన్ డాలర్స్ అందుకోవచ్చని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ రేంజ్ ఓపెనింగ్స్‌కు సలార్ దగ్గరగా వస్తుందని అంచనా వేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">