Salaar OTT Rights : 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. తాజాగా ఈయన ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్' సినిమాలో నటించారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలతో థియేటర్లు మార్మోగిపోతున్నాయి. ఈ చిత్రం అంతటా పాజిటివ్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు. నెట్టింట రివ్యూలతో ట్రెండ్ చేస్తున్నారు.
Salaar Satellite Rights : మరోవైపు తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కుడా భారీ ధరకు అమ్ముడుపోయయని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ దీన్ని సుమారు రూ.200 కోట్లకు సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ స్కేల్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ 'స్టార్ మా' సొంతం చేసుకుంది. ఓటీటీలో ఈ సినిమా విడుదలైన తర్వాత బుల్లితెరపై ఈ చిత్రం టెలికాస్ట్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేవా - వరద వైరం - శౌర్యాంగ పర్వం
Salaar Part 2 Title : మరోవైపు సలార్ సినిమా క్లైమాక్స్ కంప్లీట్ అయ్యాకా, ఎండ్ క్రెడిట్స్‌కు ముందు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ను ప్లాన్ చేశారు డైరెక్టర్ నీల్. అందులో ఆయన ఈ సినిమాకు సీక్వెల్‌ను ఉన్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో 'సలార్ పార్ట్ 2'ను 'శౌర్యాంగ పర్వం'గా నామకరణం చేశారు. ఇందులో ప్రభాస్-పృథ్వీల మధ్య ఉన్న స్నేహం వైరంగా ఎలా మారిందనే పాయింట్ చుట్టూ కథ తిరిగేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ మూవీ గురించి మరింత సమాచారాన్ని ఆయన వెల్లడించలేదు. దీంతో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందా అంటూ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా త్వరలోనే రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
సలార్ దెబ్బకు Book My Show సర్వర్లు క్రాష్- ఏమన్నా క్రేజా ఇది?
'సలార్' టికెట్ ధరల పెంపు- తెలంగాణలో మల్టీప్లెక్స్‌కు రూ.100- ఏపీలో ఎంతంటే?