ETV Bharat / entertainment

15ఏళ్ల క్రితమే స్టోరీ లైన్​- 1000మందితో 'దేవ' ఫైట్​- ప్రభాస్, శ్రుతి సాంగ్​- సలార్​ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్​ ఇవే!

Salaar Interesting Facts In Telugu : ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న 'సలార్'​ వచ్చే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీకు తెలియని పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

Salaar Interesting Facts In Telugu
Salaar Interesting Facts In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 12:06 PM IST

Updated : Dec 21, 2023, 12:19 PM IST

Salaar Interesting Facts In Telugu : ఎప్పుడెప్పుడా అని ప్రభాస్‌ అభిమానులతోపాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర సంగతులు మీకోసం.

15ఏళ్ల క్రితమే ఆలోచన
Salaar Storyline Telugu : అయితే సలార్ స్టోరీ ఐడియా ఇప్పటిది కాదట. 15ఏళ్ల క్రితమే కథకు బీజం పడిందట. అప్పటికి ప్రశాంత్ నీల్ దర్శకుడు కాదట. అయితే డైరెక్టర్‌గా తొలి ప్రయత్నంలోనే ఇంత పెద్ద కథను చెప్పాలంటే బడ్జెట్‌ దృష్ట్యా కొన్ని పరిమితులుంటాయి. అందుకే కొన్ని చిత్రాలు తీశాక సలార్​ను తెరకెక్కిద్దామనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అనుకున్నది చేసేశారు!
Prashanth Neel Salaar : కన్నడ సినిమా ఉగ్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టారు ప్రశాంత్ నీల్. యశ్​ నటించిన కేజీఎఫ్​-1, కేజీఎఫ్​-2 సినిమాలో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుుకున్నారు. ఇప్పుడు తన డ్రీమ్​ ప్రాజెక్ట్ సలార్​కు పట్టాలెక్కించారు. మొత్తానికి ప్రశాంత్​ అనుకున్నది చేసేశారు!

అది విశేషమే!
Prabhas Salaar Photos : పాన్​ఇండియా యాక్టర్​ అని కాకుండా సినిమాలోని దేవ పాత్రను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్​ను ఎంపిక చేయడం విశేషం. అమాయకత్వంతో కూడుకున్న రోల్​ అది. అయితే ఈ సినిమా రెండు పార్ట్​లుగా తెరకెక్కించాలని షూటింగ్​లోనే అనుకున్నారట.

కేజీఎఫ్​లో యశ్​!
Salaar Yash Cameo : సలార్​ షూటింగ్​ స్టార్ట్​ అయిన నుంచి ఈ సినిమాకు కేజీఎఫ్​కు లింక్​ ఉందని అంతా ఊహించారు. కానీ ఎలాంటి కనెక్షన్ లేదని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఉగ్రం రీమేక్​ కూడా కాదని తెలిపారు. సలార్​లో యశ్​ గెస్ట్ రోల్​లో కనిపిస్తారన్నదేని రూమర్లకే పరిమితమైంది.

ప్రభాస్-శ్రుతి సాంగ్​!
Prabhas Shruti Haasan : అయితే హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ శ్రుతిహాసన్‌లపై ఓ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరించాలనుకున్నారు. అయితే ఎమోషనల్‌గా సాగే కథలో అలాంటి పాట పెడితే కనెక్ట్‌ కాదనుకుని వదిలేశారు.

దేవతో మన్నార్ సమానం!
Prithviraj Sukumaran Salaar Look : సినిమాలో దేవకు సమానమైన మరో పాత్ర వరదరాజ మన్నార్‌. ఈ రోల్‌ కోసం ముందు నుంచీ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌నే అనుకున్నారు దర్శకుడు. ఆయనే లేకపోతే సలార్‌ లేదని ప్రశాంత్‌ చెప్పడం గమనార్హం. పృథ్వీరాజ్‌ నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

షూటింగ్​ ప్రారంభమైందిలా
Salaar Movie Shooting Start Date : 2021 జనవరి 29న తెలంగాణలోని గోదావరిఖనిలో షూటింగ్‌ ప్రారంభమైంది. తర్వాత, హైదరాబాద్, మంగళూరు, వైజాగ్‌ పోర్టు తదిరత ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. 114 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది.

1000మందితో ఫైట్​
Salaar Prabhas Fight : మూవీలోని ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం మేకర్స్​ దాదాపు రూ.20 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మరో సన్నివేశంలో హీరో 1000 మందితో ఫైట్‌ చేస్తాడని టాక్‌. సినిమా బడ్జెట్‌ సుమారు రూ.270 కోట్లు.

ఎ సర్టిఫికెట్
Salaar Censor Certificate : అసభ్యత లేకపోయినా కొన్ని హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్‌ జారీ చేసింది. రన్‌టైమ్‌: 2 గంటల 55 నిమిషాల 19 సెకన్లు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కేజీఎఫ్​లో నరాచీ- సలార్​లో ఖాన్సార్​
Khansar In Salaar : కేజీఎఫ్​లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్‌ నీల్‌ ఇప్పుడు సలార్‌తో ఖాన్సార్‌ వరల్డ్‌ను పరిచయం చేయనున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం. మరి, దేవ- వరదరాజ మన్నార్‌ శత్రువులుగా మారడానికి కారణమేంటి? అసలు ఖాన్సార్‌ కథేంటి? తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్​ చేస్తే చాలు!

Last Updated : Dec 21, 2023, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.