ETV Bharat / entertainment

అడ్వాన్స్​ బుకింగ్స్​లో 'సలార్' తగ్గేదేలే- ఓపెనింగ్స్​ రూ.150కోట్లు పక్కా! - సలార్ మూవీ తొలిరోజు వసూల్లు

Salaar Box Office Prediction : మరికొద్దిగంటల్లో ప్రభాస్ సలార్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. డార్లింగ్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అడ్వాన్స్​ బుకింగ్స్​లో దూసుకుపోతోంది. ఇప్పుటి వరకు వరల్డ్​వైడ్​గా రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది!

Salaar Box Office Prediction
Salaar Box Office Prediction
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 9:57 AM IST

Salaar Box Office Prediction : పాన్​ఇండియా స్టార్ ప్రభాస్​, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్​ నీల్​ కాంబోలో తెరకెక్కిన సలార్ మరో రోజులో థియేటర్లలో సందడి చేయనుంది. డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినిమా లవర్స్​ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన సలార్ సెకండ్ ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. దీంతో సలార్​ మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడి మరీ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

ఓవర్సీస్​తోపాటు ఉత్తరాదిలో అడ్వాన్స్​ బుకింగ్స్ ఎప్పుడో స్టార్ట్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో మంగళవారమే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆన్​లైన్​లో సలార్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సలార్ డే1 అడ్వాన్స్ బుకింగ్స్ రూ.50కోట్ల మర్క్ దాటిపోయాయట. దీంతో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్ల కొల్లగడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిజాంలో ముందుగా ఆఫ్​లైన్​ టికెట్ల అమ్మకం ప్రారంభించింది. అంటే సెలెక్టెడ్ థియేటర్స్​లో కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఈ విషయం తెలియగానే ఆడియన్స్ థియేటర్స్ వద్ద బారులు తీరారు. ఇక ఆ తర్వాత కొన్ని గంటలకు ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ చేశారు. బుక్ మై షో లో అలా ఓపెన్ పెట్టగానే టికెట్స్ బుక్ చేసుకోవడానికి అందరూ ఒక్కసారిగా పోటీపడ్డారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.24కోట్లు కలెక్ట్ చేసిందట. అలాగే ఓవర్సీస్​లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో మూడు మిలియన్ల మార్క్ అందుకుంది. అంటే ఓవరాల్​గా ఈ మూవీ డే వన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.50 కోట్లు దాటిపోయింది. అంతేకాకుండా ఫస్ట్ వీకెండ్​లోనే వరల్డ్ వైడ్​గా రూ.65 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్​ను అందుకోగా మొదటిరోజు షోలు ప్రారంభమయ్యే ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వంద కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే సలార్ కంటే ముందు దళపతి విజయ్ నటించిన 'లియో' మూవీ ఈ అరుదైన ఘనతను సాధించింది. ఇప్పుడు సలార్ కూడా ఆ రేర్ ఫీట్​ను అందుకోవడం గ్యారెంటీ అని చెబుతున్నారు. సలార్ డే1 టార్గెట్ కూడా లియో ఓపెనింగ్స్​ను క్రాస్ చేయడమే. ఈ ఏడాదిలో రూ.145 కోట్ల గ్రాస్​తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా 'లియో' నిలిచింది. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేస్తూ సలార్ రూ.150 కోట్ల ఓపెనింగ్స్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. సినిమా పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా 'కేజీఎఫ్ 2' ఓపెనింగ్స్​ను సైతం బ్రేక్ చేసే ఛాన్సులు 'సలార్'ఉన్నాయని సినీ పండితులు చెబుతున్నారు.

సలార్​ దెబ్బకు Book My Show సర్వర్లు క్రాష్- ఏమన్నా క్రేజా ఇది?

PVR, మిరాజ్​లో 'సలార్' రిలీజ్​కు నో- ఆ​ మల్టీప్లెక్స్​లను బాయ్​కాట్​​ చేసిన హోంబలే ఫిల్మ్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.