Salaar Advance Booking Collection Worldwide : రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సలార్. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిజీజ్కు ముందే రికార్డులు బద్దలుకొడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. ప్రభాస్ ఇమేజ్‌తో 'సలార్' టికెట్లు హాట్‌కేకుల్లా అమ్మడవుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే వరల్డ్ వైడ్‌గా ఇంకా పలు దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆడ్వాన్స్ బుకింగ్స్‌లో 'సలార్' రూ.21 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.
'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ : 'సలార్' సినిమా బుకింగ్స్ ఉత్తరాదిలో ఆదివారం (డిసెంబర్ 17) ప్రారంభమయ్యాయి. ఇక్కడ సలార్‌కు భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. హిందీలో 15 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇతర భాషల్లో 10 వేలకు పైగా టికెట్లను సినీ ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. పీవీఆర్, ఐనాక్స్‌లో స్క్రీన్లలోనే దాదాపు 25 వేల టికెట్లు బుక్ అయ్యాయట. దీని ద్వారా రూ.5 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ రూ.4.29 కోట్ల మేర ఉన్నట్లు సమాచారం.
'సలార్' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ : 'సలార్' ఓవర్సీస్లోనూ అదరగొడుతోంది. అమెరికా, కెనడాలో ఇప్పటి 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని తెలుస్తోంది. యూఏఈ, మిడిల్ ఈస్ట్ లో లక్ష డాలర్లు, యూకేలో 2 లక్షల పౌండ్లు వసూలు చేసిందట. మొత్తంగా 'లార్' ఓవర్సీస్‌లో రు.16 కోట్లు (2 మిలియన్ డాలర్లు) కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 'సలార్' మొత్తంగా రూ.21 కోట్లు రాబట్టినట్లైంది. దీన్ని బట్టి చూస్తే తొలి రోజు ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ పక్కా సాధిస్తుందని సినీ ట్రెడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
Salaar Cast : కేజీఎఫ్, కాంతార వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్స్మ్ సలార్ మూవీని నిర్మించింది. సినిమాలో ప్రభాస్‌తో పాటు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, ఈశ్వరి రావు, శరణ్ శక్తి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్'- కొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్న మెగాప్రిన్స్
వైలెంట్‌గా 'సలార్' సెకండ్ ట్రైలర్- ప్రభాస్ డైలాగ్స్‌కు గూస్‌బంప్సే!