ETV Bharat / entertainment

'ప్రభాస్​లో అదే అత్యుత్తమ లక్షణం.. తనకు ప్రత్యేక స్థానం ఉంది' - ప్రభాస్​ గోపీచంద్​ సినిమా

పాన్​ ఇండియా స్టార్​ హీరో ప్రభాస్​పై ప్రశంసలు కురిపించింది శృతిహాసన్. ప్రభాస్​లో ఉన్న ఆ లక్షణం చాలా అత్యుత్తమం అని.. ప్రపంచంలో అలాంటి వారికి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకొచ్చింది. మరోవైపు ప్రభాస్​తో సినిమాపై హీరో గోపించద్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్​
ప్రభాస్​
author img

By

Published : Jul 3, 2022, 9:20 PM IST

ప్రభాస్​తో సినిమా అంటే చాలు తోటి నటులకు నిజంగా ఫుల్​మీల్సే. సెట్స్​లో ఉన్న నటులకు రకరకాల వంటలను తెప్పించి రుచిచూపిస్తాడు. అందుకే ప్రభాస్​ ఆతిథ్యానికి ఫిదా అవ్వని నటుడంటూ లేరు. సెట్​లో ప్రభాస్​తో గడిపిన క్షణాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా స్టార్​ హీరోయిన్​ శృతిహాసన్​ కూడా ప్రభాస్​ను పొగడ్తలతో ముంచెత్తింది. సలార్​లో ఈ రెబల్​ స్టార్​ సరసన నటిస్తున్న శృతి.. ఇతరులకు కడుపు నిండా తినిపించడమే ప్రభాస్​ అత్యుత్తమ లక్షణం అని చెప్పుకొచ్చింది.

తోటి వారికి ఇలా కడుపు నిండా భోజనం పెట్టేవారికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంటుందని శృతిహాసన్​ తెలిపింది. ప్రభాస్​ నిజంగా చాలా ప్రేమగా భోజనం పెడతాడని చెప్పుకొచ్చింది. శృతి చేసిన కామెంట్స్​ విని అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్​ 'సలార్'​, 'ఆదిపురుష్'​, 'ప్రాజెక్ట్​ కే' చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వ​రలో మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. మరోవైపు శృతిహాసన్​ తెలుగులో 'సలార్'​తో పాటు చిరంజీవి సరసన 'వాల్తేరు వీరయ్య'లో నటిస్తోంది.

ఆ చిత్రం ప్రభాస్​తోనే : ప్రభాస్​, గోపీచంద్​ ఫ్రెండ్​షిప్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్​గా ఉంటుంటారు. అయితే వీళ్లు వెండితెరపై మాత్రం కలిసి నటించింది ఒక్కసారే. వర్షం చిత్రం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్​ను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్​తో సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గోపీచంద్. తాను పాన్​ ఇండియా సినిమా.. అందులోనూ మల్టీ స్టారర్​ చేయాల్సి వస్తే ప్రభాస్​తోనే చేస్తానన్నారు. మరి ఈ కాంబినేషన్​ రిపీట్​ అవుతుందో లేదో తెలియాలంటే అభిమానులు ఓపిగ్గా ఎదురుచూడాల్సిందే.

ఇదీ చూడండి : అంజలి స్పెషల్​ సాంగ్​.. నితిన్​తో చిందులు.. 'కార్తికేయ 2' వాయిదా!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.