ETV Bharat / entertainment

ఆమె అలా అడిగేసరికి నా కళ్లలోంచి నీళ్లొచ్చాయి: సాయి పల్లవి

'విరాటపర్వం' సినిమా ప్రెస్​మీట్​లో ఓ భావోద్వేగ సంఘటనను పంచుకున్నారు నటి సాయి పల్లవి. సరళ పాత్ర చేయడం, వారి ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన అనుభవాల గురించి తెలిపారు. ఇక తమ బ్యానర్​లో వచ్చిన తొలి బయోపిక్​ 'విరాట పర్వం' అని, అందుకు గర్వపడుతున్నట్లు నిర్మాత సురేశ్​ బాబు వెల్లడించారు.

virata parvam press meet
sai pallavi
author img

By

Published : Jun 18, 2022, 9:56 PM IST

ఆమె అలా అడిగే సరికి నా కళ్లలోంచి నీళ్లొచ్చేశాయి: సాయి పల్లవి

"సాయిపల్లవి ఒప్పుకోకపోతే 'విరాటపర్వం' చేసేవాడిని కాదు. సరళ పాత్రకు సాయిపల్లవి మాత్రమే న్యాయం చేయగలదనే నమ్మకంతోనే సినిమా తీశా. అది నిజమై, మా చిత్రం విజయం సాధించింది." అని దర్శకుడు వేణు ఊడుగుల అన్నారు. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలుగా వేణు ఊడుగుల దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'విరాటపర్వం'. సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. విప్లవ భావజాలంతో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'విరాటపర్వం' ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శనివారం 'విరాటపర్వం సక్సెస్‌ ప్రెస్‌మీట్' నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత సురేశ్‌ బాబు, సాయిపల్లవి, వేణు ఊడుగుల, తూము సరళ సోదరుడు మోహనరావు, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు.

virata parvam press meet
'విరాటపర్వం' ప్రెస్ మీట్

తొలి బయోపిక్: ఇందులో భాగంగా నిర్మాత సురేశ్‌ బాబు మాట్లాడుతూ.. "సురేష్‌ ప్రొడక్షన్‌ నిర్మించిన మొదటి బయోపిక్‌ 'విరాటపర్వం'. రానా ఈ సినిమా ఓకే చేసిన తర్వాత "ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నావ్‌?" అని ప్రశ్నించాను. దానికి రానా.. 'ఈ పాత్రను పోషించడం నా బాధ్యత' అని చెప్పాడు. సినిమా విడుదలయ్యాక అందరి నుంచి వస్తోన్న స్పందన చూశాక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చామనిపించింది" అని అన్నారు.

sai pallavi
సరళ కుటుంబసభ్యులతో సాయి పల్లవి

అనంతరం సాయి పల్లవి మాట్లాడుతూ.. "సరళ పాత్ర చాలా బరువైనదని ఆమె కుటుంబాన్ని కలిసినప్పుడు తెలిసింది. ఆ కుటుంబసభ్యులు నాపై చూపించిన ప్రేమను జీవితంలో మరిచిపోలేను. మా చిత్రాన్ని ఆదరించి, విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు" అని తెలిపారు.

"సరళ గారి ఇంటికి వెళ్లినప్పుడు ముందుగా నాకు చాలా భయమేసింది. ఎందుకంటే ఎవరైనా నా కుటుంబంలో ఒకరిపై సినిమా చేస్తానంటే నేను అసలే ఒప్పుకోను. ఎందుకంటే ఎలా చేస్తారో తెలియదు. ప్రైవసీ కూడా ముఖ్యం కదా. కానీ వాళ్లు మాత్రం నన్ను సాదరంగా ఆహ్వానించి.. చీర ఇచ్చి, బొట్టు పెట్టారు. అప్పుడు అనిపించింది.. వాళ్లను ముందే కలిసి ఉండాల్సిందని. వాళ్లను కలిశాక వాళ్ల గుండెళ్ల ఉన్న బరువు నేను అనుభవించాను. 'ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావమ్మా?' అని వాళ్లు అడిగేసరికి నా కళ్లలో నీరు వచ్చేసింది."

-సాయి పల్లవి, నటి

ఇక, సరళ సోదరుడు తూము మోహన్‌రావు మాట్లాడుతూ.. "దర్శకుడి మీద నమ్మకంతో ప్రివ్యూ చూడకుండా సినిమా విడుదలయ్యాక కుటుంబంతో కలిసి థియేటర్‌లో సినిమా చూశా. 'విరాట పర్వం' చూశాక మా కుటుంబం మొత్తం భావోద్వేగానికి గురయ్యాం. ఉద్యమంపై నా సోదరికి ఉన్న ప్రేమ, ముప్పై ఏళ్లనాటి నిజాన్ని తెరపై చూపడానికి దర్శకుడు పడిన కష్టం, ఆయన చేసిన పరిశోధన అభినందనీయం" అని ప్రశంసించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఆ ఒక్కరి కోసమే 'విరాటపర్వం' చేశా: రానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.