ETV Bharat / entertainment

ఆ ఒక్క విషయానికి మాత్రం నో అంటున్న సాయి పల్లవి!

సహజత్వం కనిపించేలా ఉట్టిపడే ఆ అందం ఆమె సొంతం. తన నటనతో ఎందరినో కట్టి పడేసిన ఈ అమ్మడు మరెవరో కాదు మన అల్లరి పిల్ల సాయి పల్లవి. నేచురల్​ యాక్టింగ్​తో తనదైన ముద్ర వేసుకున్న ఈ క్యూటీ ఆ ఒక్క విషయానికి మాత్రం ఎప్పటికి నో అంటానంటోంది.

sai pallavi movies
sai pallavi
author img

By

Published : Oct 9, 2022, 10:17 PM IST

అల్లరి పిల్ల 'భానుమతి' అయినా.. 'కామ్రేడ్ రవన్న' కోసం వెతికే 'వెన్నెల' అయినా మనకు ఆ పాత్రను అలానే గుర్తుండిపోయేలా చేసిన నటి సాయి పల్లవి. డాక్టర్​గా మొదలైన తన కెరీర్​ డ్యాన్స్​ మీద ఇష్టంతో సినిమా వైపు అడుగులు వేసేలా చేసింది. సహజంగా కనిపించే ఈ సహజ నటి తమిళ తెలుగు మలయాళ ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసుకుంది. ఇలా ఈ నేచురల్​ బ్యూటీ గురించి ఎంత చెప్పిన తక్కువే అంటారు అభిమానులు.

'ప్రేమమ్' మలయాళ వర్షన్​తో హీరోయిన్​గా వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి.. 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రజలని తనవైపుకు తిప్పుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కొంటె పిల్లలా, నాన్న గారాల పట్టిలా తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి కాల్షీట్​ అంతా తెలుగు సినిమాలతో నిండిపోయాయి. నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలు ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటోంది ఈ కుట్టి. మలయాళ, తెలుగు భాషలతో పాటు తమిళంలోనూ వరుస షెడ్యుల్లతో బిజీబిజీగా ఉంటోంది. అయితే ఆ ఒక్క విషయానికి మాత్రం తను ఎప్పటికి నో అనే చెప్తానంటోంది సాయి పల్లవి.

స్కిన్ షో కు మాత్రం ఎప్పుడూ నో చెప్తూనే వస్తున్న సాయి పల్లవి.. నటన అంటే గ్లామర్ షో మాత్రమే కాదు అని అభిప్రాయపడుతోంది. అయితే సాయి పల్లవి ఒకే తరహా కథలను ఎంచుకుంటున్న విషయమై పై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె కావాలనే ఇలాంటి పాత్రలను ఎంచుకుంటోందని కొందరు అంటుంటే.. యాదృచ్ఛికంగానే తన వద్దకు ఇలాంటి కథలు వస్తున్నాయని మరికొందరి వాదన.

ఇక ఇదే విషయం పై స్పందించిన సాయి పల్లవి.. తాను ఒక పాత్రలో చేసేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పెట్టుకోనని తెలిపింది. అయితే కథలను ఎన్నుకునేటప్పుడు.. నటనకు స్కోప్ ఉండేలా చూసుకోవడం సహా తన కోయాక్టర్స్​తో తన పాత్ర ఆధారపడేలా చూసుకుంటానని తెలిపింది. ఏ పాత్ర చేసినా అందుకు తాను కచ్చితంగా న్యాయం చేస్తానంటోంది ఈ అమ్మడు.

ఇదీ చదవండి: ఆమె లేకపోతే ఈరోజు నేను ఉండేదాన్ని కాదేమో!: దీపికా పదుకొణె

కుంభస్థలాన్ని బద్ధలు కొడుతున్న సౌత్ సినిమా.. రూ.300 కోట్ల చిత్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.