ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌లో ఎప్పుడూ ఏదో ఒక అంశం ట్రెండింగ్‌లో ఉంటుంది. సాధారణ నెటిజన్ల మొదలు ప్రముఖ సంస్థలు, సెలెబ్రిటీల వరకు ఇందులో భాగమవుతారు! ఈ క్రమంలోనే ట్విటర్‌లో తాజాగా వన్ వర్డ్ ట్రెండ్ నడుస్తోంది. అంటే.. ఎవరైనా యూజర్ కేవలం ఒకే పదాన్ని ట్వీట్ చేయడం అన్నమాట. ఇప్పుడా బాటలో తమ చిత్రాన్ని ప్రమోట్ ఆయా చిత్రబృందాలు కూడా ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి.
తాజాగా దక్షిణాదిలో బిగ్గెస్ట్ చిత్రాలుగా చెప్పుకొనే 'పుష్ప', 'కేజీయఫ్', 'ఆర్‌ఆర్‌ఆర్', 'సలార్' టీమ్‌లు కొత్త ట్రెండ్‌ను అనుసరించాయి. సినిమాలోని తమ హీరో పాత్రని ఒక్కపదంలో నిర్వచిస్తూ శనివారం ఉదయం ట్వీట్స్ చేశాయి. ఇంతకీ ఇప్పుడెందుకు ఇలా అప్‌డేట్స్ ఇస్తున్నాయనేగా? ప్రస్తుతం ట్విటర్‌లో వన్ వర్డ్ ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగానే చిత్రబృందాలు ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుని ట్వీట్స్ చేశాయి. ఇంతకీ ఏ చిత్రబృందం ఏం ట్వీట్ చేసిందో చూద్దాం రండి..
నరాచీ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకొని, పవర్‌ని చూపించిన తమ హీరో రాఖీబాయ్‌ని 'మాన్‌స్టర్'గా పేర్కొంటూ 'కేజీయఫ్ - 2' టీమ్ శనివారం ఉదయం ఓ ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ వచ్చిన కొన్ని సెకన్లలోనే ప్రభాస్ హీరోగా సిద్ధమవుతున్న'సలార్' ట్విటర్ పేజీ నుంచి 'వైలెంట్' అంటూ ఓ పోస్ట్ వచ్చింది. ఉన్నట్టుండి ఈ రెండు టీమ్స్ నుంచి ట్వీట్స్ రావడంతో ఏదైనా సర్‌ప్రైజ్ ఉందా? అనుకున్నారు. 'కేజీయఫ్', 'సలార్' గురించి నెటిజన్లు చర్చించుకుంటున్న సమయంలో 'తగ్గేదే లే' అంటూ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' ముందుకు వచ్చింది. 'పుష్ప - ది రైజ్' ఖాతా నుంచి 'ఫైర్' అంటూ పోస్ట్ వెలువడింది. 'ఆర్‌ఆర్‌ఆర్’ సైతం 'రామ్', 'భీమ్' పేర్లను ట్వీట్స్ చేయగా.. 'NTR 30' నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ నుంచి 'వస్తున్నా' అని, 'బింబిసార' తెరకెక్కించిన 'ఎన్టీఆర్ ఆర్ట్స్' నుంచి 'జగత్ జజ్జరిక', 'భయం'(ఎన్టీఆర్ 30ని ఉద్దేశిస్తూ) అంటూ ట్వీట్స్ బయటకు వచ్చాయి. దీంతో నెటిజన్లు అందరూ ఆయా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇదీ చూడండి: దాదా ఎంత పని చేశావ్.. మెగా బ్లాక్ బస్టర్ ట్రైలర్ సీక్రెట్ తెలిసిపోయిందిగా