ETV Bharat / entertainment

'ఆర్​ఆర్​ఆర్​'కు మరో అరుదైన గౌరవం.. ఆస్కార్​ టీమ్​ నుంచి పిలుపు! - Oscar Jury Members updates

టాలీవుడ్​తో పాటు యావత్​ సినీ ఇండస్ట్రీని షేక్​ చేసి ఆస్కార్స్​ వరకు వెళ్లిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంతకీ అదేంటంటే?

ram charan ntr
ram charan ntr
author img

By

Published : Jun 29, 2023, 11:21 AM IST

Updated : Jun 29, 2023, 12:26 PM IST

Oscar Jury Members 2023 : ఆస్కార్​తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న 'ఆర్ఆర్​ఆర్'​ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ సారి అకాడమీ టీమ్.. ఆస్కార్ జ్యూరీలో మొత్తం 398 మంది కొత్త సభ్యులకి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించగా.. అందులో గ్లోబల్ స్టార్​ రామ్ చరణ్​తో పాటు యంగ్​ టైగర్​ ​ఎన్​టీఆర్​ యాక్టింగ్ కేటగిరిలో మెంబర్స్​గా స్థానం దక్కించుకున్నారు.

ఇక సంగీత విభాగంలోకి మ్యూజిక్​ డైరెక్టర్​ ఎం.ఎం కీరవాణి ఎంపిక కాగా.. 'నాటు నాటు' గేయ రచయిత చంద్రబోస్, టెక్నిషియన్​ సెంథిల్, ప్రొడక్షన్​ డిజైనర్​ సాబు సిరిల్​ కూడా ఈ జ్యూరీలో అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరికి ఆస్కార్‌ కమిటీలో సభ్యత్వం లభించడం పట్ల వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దర్శకధీరుడు రాజమౌళికి కూడా ఈ ప్యానెల్​లో స్థానం కల్పించి ఉంటే బాగుండేదంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Oscar Jury Members India : ఇక నిర్మాతల కేటగిరీ నుంచి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్​ జ్యూరీలో మెంబర్​ అయ్యారు. ఆయనతో పాటు ఇంకొన్ని కేటగిరీలకు సీనియర్​ దర్శకుడు మణిరత్నం, చైతన్య తమహనే, షౌనెక్ సేన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్‌లకు ఆస్కార్ ప్యానెల్‌లో చోటు దక్కింది. వీరందరూ.. 2024లో జరగనున్న ఆస్కార్​ అవార్డ్స్​ ఓటింగ్స్​లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా.. వచ్చే ఏడాది ఆస్కార్‌ వేడుక మార్చి 10న నిర్వహించనున్నారు.

ప్రస్తుతం అకాడమీలో 10,000 మందికి పైగా సభ్యులుగా ఉన్నారు. అకాడమీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఏడాది 40 శాతం మంది మహిళలకు చోటు కల్పించారని పేర్కొంది. ప్రతి ఏడాది విడుదలయై అస్కార్‌ ప్యానెల్‌ జాబితాలో ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్​కు చెందినవారే ఉండగా.. ఈ సారి ఈ ప్యానల్​లో ఇతర దేశాలకు చెందిన కళాకారులు ఎక్కువగా ఉండటం విశేషం.
ఇక 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా విషయానికి వస్తే.. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇందులోని 'నాటు నాటు' సాంగ్​కు ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డు దక్కింది. ఈ సాంగ్‌ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్​ అవార్డును అందుకున్నారు.

Last Updated : Jun 29, 2023, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.