జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సెన్సెషనల్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. అయితే ఈ సినిమా ఓటీటీలో కొత్త రికార్డును సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా హిందీ వెర్షన్.. భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన చిత్రంగా నిలిచినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత.. అంటే మే 20 నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం నెలరోజుల్లోనే.. మూడు గంటల రెండు నిమిషాల నిడివి ఉన్న.. ఈ సినిమాను ప్రేక్షకులు 45మిలియన్ గంటల పాటు వీక్షించారు. ఇది అరుదైన ఘనతగా నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా.. భారత్ నుంచి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాగా నిలిచినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది నెట్‌ప్లిక్స్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 12వందల కోట్లు రూపాయలు కలెక్షన్స్ రాబట్టి.. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సరసన హీరోయిన్లుగా.. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నటించారు.
ఇదీ చూడండి: పూరిజగన్నాథ్పై బండ్లగణేశ్ షాకింగ్ కామెంట్స్!