ETV Bharat / entertainment

'దళపతి 67' ఆల్​ టైమ్​ రికార్డ్​.. ఏకంగా రూ.230కోట్లకు.. కమల్​ 'విక్రమ్​' ఎంతంటే? - భారీ ధరకు దళపతి 67 ఓటీటీ రైట్స్​

విజయ్​ దళపతి 67 ఓటీటీ శాటిలైట్​ రైట్స్​ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఇది తమిళ చిత్రసీమలో ఆల్​టైమ్​ రికార్డ్​. ఎంతంటే?

thalapathy 67 record ott rights
'దళపతి 67' ఆల్​ టైమ్​ రికార్డ్​.. ఏకంగా రూ.230కోట్లకు..
author img

By

Published : Feb 3, 2023, 7:42 PM IST

ఈ ఏడాది వారిసు చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ స్టార్​ హీరో దళపతి విజయ్‌. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ దళపతి 67. విక్రమ్‌ సినిమాతో ఇండియా వైడ్​గా సూపర్‌ హిట్‌ను అందుకున్న లోకేశ్‌ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్స్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

అప్పుడే ఇలా షూటింగ్ అలా ప్రారంభమైందో లేదో అంతలోనే.. ఈ సినిమా ఓటీటీ శాటిలైట్​ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయని తెలిసింది. రూ.230కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇది తమిళ చిత్రసీమలోనే ఆల్​టైమ్​ రికార్డు. ఇకపోతే ఈ చిత్రంలో సంజయ్​దత్ విలన్​గా నటిస్తున్నారు. హీరోయిన్​గా త్రిష నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ప్రియా ఆనంద్‌, డ్యాన్స్​ మాస్టర్‌, నటుడు శాండీ, దర్శకుడు మిస్కిన్‌, నటుడు మన్సూర్‌ అలీఖాన్‌లు, మాథ్యూ థామస్‌ తదితరులు ఇందులో నటిస్తున్నారు. హీరోయిన్​గా త్రిష నటిస్తోంది. ఈ తారాగణంతో విజయ్‌ సినిమాపై అంచనాలు తారాస్థాయిని తాకాయి. దీంతో విజయ్‌ వర్సెస్‌ సంజయ్‌ కాంబినేషన్‌ను తెరపై చూసేందుకు విజయ్‌ అభిమానులతో పాటు సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రం తర్వాత పొన్నియిన్ సెల్వన్​ తమ శాటిలైట్​ ఓటీటీ హక్కులను భారీ ధరకు అమ్మింది. దీని ఓటీటీ శాటిలైట్ రైట్స్​ రూ.125కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. త్వరోలోనే ఈ సినిమా రెండో భాగం విడుదల కానుంది. ఇందులో ఆదిత్య కరికాలన్‌ (విక్రమ్‌), పొన్నియిన్‌ సెల్వన్‌ (జయం రవి), వందియ దేవన్‌ (కార్తి), నందిని (ఐశ్వర్యరాయ్‌బచ్చన్‌) కీలక పాత్రలు పోషించారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. మణిరత్నం దర్శకుడు.

లోకేష్​ కనగరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్​ స్టార్ కమల్​హాసన్ నటించిన విక్రమ్​ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 400కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్​ కూడా రానుంది. దీని ఓటీటీ శాటిలైట్ రైట్స్​ రూ.112కోట్లకు కొనుగోలు చేశారట. ఇక ఈ చిత్రం సూపర్ హిట్​ కావడంటో లోకేశ్ ప్రస్తుతం రూపొందిస్తున్న దళపతి 67పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే దాని శాటిలైట్​ ఓటీటీ హక్కులు ఏకంగా రూ. 230కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.