ETV Bharat / entertainment

అల్లు అర్జున్​పై ట్వీట్.. మారుతిని ఆటాడేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్! - ప్రభాస్ కొత్త సినిమాలు

Prabhas Fans Fire On Director Maruti : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఫ్యాన్స్ మరోసారి దర్శకుడు మారుతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతాభావం లేదని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ చేస్తూ ఓ ఆటాడేసుకుంటున్నారు. గ్యాప్ లేకుండా మారుతిపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఏమైందంటే..

Director Maruthi Controversy
మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్​
author img

By

Published : Jul 22, 2023, 5:33 PM IST

Prabhas Fans Fire On Director Maruti : మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ గురించి మూవీ యూనిట్​ అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. సినిమా షూటింగ్ అయితే ప్రారంభమైంది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తైంది. అయితే ప్రభాస్ ఈ చిత్రంతో పాటు.. భారీ బడ్జెట్​ సినిమా 'ప్రాజెక్ట్ కె' చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్​ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అది కూడా ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా ఆవిష్కరించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయిందని, హాలీవుడ్ స్టైల్​లో గ్లింప్స్ ఉందని మెచ్చుకుంటున్నారు. అయితే ప్రబాస్​తో సినిమా చేస్తున్న దర్శకుడు మారుతి మాత్రం ఈ గ్లింప్స్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. రీసెంట్​గా విడుదలై 'బేబీ' మూవీ మంచి సక్సెస్​ను అందుకుంది.

అయితే 'బేబీ' మూవీ సక్సెస్ మీట్​కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరై సినిమా బాగుందంటూ మూవీ టీమ్​ను ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియోను మారుతి ట్వీట్ చేశారు. కానీ ప్రభాస్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్​పై మాత్రం స్పందించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లున్నారు. 'అల్లు అర్జున్ అంత క్లోజ్ అయినప్పటికీ నీతో సినిమా చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ ఆఫర్ ప్రభాస్ నీకు ఇచ్చారు. నీతో సినిమా చేస్తున్నారు. అయినా నువ్వు గ్లింప్స్ కు సంబంధించిన ఎటువంటి ట్వీట్ చేయలేదు. అంకిత భావం, కృతజ్ఞత భావం నీకులేవు' అంటూ మారుతిని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే డైరెక్టర్ మారుతి అలా చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడపతున్నారు. పైగా ఇంతలా ట్రోల్స్ చేస్తున్న కనీసం ఇప్పటికైనా స్పందించట్లేదని ఫ్యాన్స్​ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కూడా దర్శకుడు మారుతిపై.. డార్లింగ్ ఫ్యాన్స్​ అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం తన సినిమా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఫ్యాన్స్ కూల్​గానే ఉన్నారు. కానీ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా.. ఇలా చేయడం పట్ల ఫ్యాన్స్ మరోసారి మారుతిపై పుల్ ఫైర్ అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.