ETV Bharat / entertainment

చెర్రీ మూవీలో హీరోయిన్​గా సాయి పల్లవి! - నిజమెంతంటే? - గేమ్ ఛేంజర్ సినిమా అప్​డేట్

RC 16 Heroine : మెగాపవర్ స్టార్ రామ్​చరణ్.. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమాలో హీరో రామ్​చరణ్​కు జోడీగా సాయి పల్లవి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

RC 16 Heroine
RC 16 Heroine
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 10:42 PM IST

RC 16 Heroine : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ - యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'ఆర్​సీ 16' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. విలేజ్ బ్యాక్​డ్రాప్​లో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో రామ్‌చరణ్‌ పాత్ర.. పవర్‌ఫుల్‌గా ఉండనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపై తొలినుంచి ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో.. ఆర్​సీ 16లో హీరోయిన్​గా రవీనాటాండన్ కుమార్తె రాషా థడానీ, కీర్తిసురేశ్‌ నటించనున్నారని వారి పేర్లు అనేక సార్లు వినిపించాయి. తాజాగా ఇప్పుడు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు తెరమీదకు వచ్చింది. ఆమె రామ్​చరణ్​తో జతకట్టనున్నారని ఇన్​సైట్ టాక్. ఈ మేరకు మూవీటీమ్ సాయి పల్లవితో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ సినిమాలో నటుడు విజయ్‌ సేతుపతి.. విలన్​గా కనిపించనున్నట్లు టాక్. అయితే నటీనటుల గురించి చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కానీ, చెర్రీ సరసన సాయి పల్లవి నటిస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డ్​ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.. ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

ఇటీవల బిగ్​బాస్ హౌస్‌లోకి వెళ్లిన దర్శకుడు బుచ్చిబాబు.. ఈ సినిమా గురించి ఓ అప్​డేట్​ ఇచ్చారు. బిబ్​బాస్ 7​ కంటెస్టెంట్​ అంబటి అర్జున్‌ ఈ సినిమాలో కీలక రోల్​ చేస్తున్నారని చెప్పారు. "రామ్‌ చరణ్‌ సర్‌ మూవీలో నువ్వొక సూపర్‌ పాత్ర చేయబోతున్నావ్‌. ఫిక్స్‌ అయిపో" అని బిగ్​బాస్ట్​ స్టేజ్ మీద నుంచి అనౌన్స్​ చేశారు. దీంతో అర్జున్‌ సంతోషంలో మునిగిపోయాడు.

అయితే ప్రస్తుతం రామ్​చరణ్.. 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. దర్శక దిగ్గజం శంకర్.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత దిల్​రాజు ఈ సినిమా రూపొందిస్తున్నారు.

వాయిదా పడ్డ గేమ్​ ఛేంజర్ సాంగ్​ - ఫ్యాన్స్​కు మళ్లీ నిరాశే!

Game Changer Leaked Song : 'గేమ్ ఛేంజర్' సాంగ్ లీక్​పై దిల్​రాజు లీగల్ యాక్షన్.. సైబర్ క్రైమ్​లో కంప్లైంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.