RC 15 Movie Title: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమాలో చరణ్ నటనకు ఎంతో మంది విదేశీయులు కూడా ఫిదా అయ్యారు. అభిమానులుగా మారిపోయారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆయన అరుదైన అవార్డులు అందుకున్నారు. దాంతో పాటు అమెరికాలో ఆయనకు దక్కిన గౌరవం గురించి ఎంత చెప్పినా తక్కువే. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. దీంతో ఆయన గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు.
మెగా హీరో రామ్‌చరణ్.. నేడు(మార్చి 27) తన 39వ ఏట అడుగుపెట్టారు. చెర్రీ బర్త్‌డే వేడుకలు అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం.. RC 15 సెట్స్‌లో చరణ్ ముందస్తు బర్త్‌డే వేడుకలను చిత్రయూనిట్ ఘనంగా జరిపింది. ఆయన చేత కేక్ కట్ చేయించింది. చరణ్ బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ సినిమా టైటిల్‌ను స్పెషల్ వీడియో రూపంలో ప్రకటించింది. ఇంతకీ సినిమా టైటిల్ ఏంటంటే.. 'గేమ్ ఛేంజర్'.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక సినిమా విషయానికి వస్తే.. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజలితో పాటు ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేంగా జరుగుతోంది.
ఆ మధ్య కాలంలో ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందని.. 7 నిమిషాల నిడివి ఉండే సన్నివేశం కోసం ఏకంగా రూ.70 కోట్లు ఖర్చుచేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక పాట కోసం ఏకంగా రూ.25 కోట్లు, మరో రెండు సాంగ్స్ కోసం రూ.8కోట్లు, రూ.15కోట్లు కేటాయించారని ప్రచారం సాగింది. రీసెంట్గా కూడా మరో పాటను రూ.15కోట్లు పెట్టి తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరి ఆ పాట కోసమే లేదా మరో సాంగ్ కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్ర్లను రంగంలోకి దింపారట. వారందరితో కలిసి పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి.