ETV Bharat / entertainment

ఆచితూచి అడుగులేయనున్న మాస్​ మహారాజ 'ఈగల్'​కు ఇది అసలు పరీక్ష! - రవితేజ మూవీల్​ లిస్ట్

Raviteja Eagle Movie : మాస్​ మహారాజ రవితేజ తాజాగా 'టైగర్​ నాగేశ్వర రావు'గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం మిక్స్​డ్ టాక్​తో నడుస్తోంది. దీంతో ఈ ఎఫెక్ట్​ ఆయన రానున్న సినిమాలపై పడనుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Raviteja Eagle Movie
Raviteja Eagle Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 2:06 PM IST

Updated : Nov 2, 2023, 2:14 PM IST

Raviteja Eagle Movie : మాస్​ మహారాజ రవితేజ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'టైగర్​ నాగేశ్వరరావు'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు భారీ సినిమాలతో పోటీగా రంగంలోకి దిగింది. ఓ వైపు గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో టాక్​ అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా మిక్స్​డ్​ టాక్​తో థియేటర్లలో నడుస్తోంది. ఈ క్రమంలో అటు మూవీ టీమ్​తో పాటు రవితేజ ఫ్యాన్స్​ కూడా నిరాశకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఇది రవితేజ తొలి పాన్​ ఇండియా సినిమా కావడం వల్ల అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు ఈ చిత్రం తర్వాత రవితేజ మరో భారీ ప్రాజెక్ట్​ షూటింగ్​లో నిమగ్నమైపోయారు. కార్తిక్​ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న 'ఈగల్​' సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్​ డేట్​ను మేకర్స్​ రివీల్​ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. అయితే అప్పుడు కూడా ఈ చిత్రానికి భారీ కాంపిటిషన్ ఉంది. ఇండస్ట్రీలోని కొన్ని భారీ సినిమాలు సంక్రాంతికి రంగంలో దిగేందుకు ప్లాన్​ చేస్తున్నాయి. దీంతో దసరాలాగే ఈ పండుగకు కూడా పలు సినిమాలు క్లాష్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

2024 Sankranthi Release Movies : సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు 'గుంటూరు కారం', విజయ్​ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' లాంటి చిత్రాలు సంక్రాంతి రేస్​కు సిద్ధమయ్యాయి. దీంతో సందిగ్ధంలో పడ్డ ఈగల్ టీమ్ ఈ చిత్ర విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్​ వచ్చాయి. కానీ వాటన్నింటికీ ఫుల్​ స్టాప్​ పెట్టిన మూవీ టీమ్​ ఈ సంక్రాంతికి బరిలో దిగుతున్నట్లు అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇచ్చింది.

అయితే గత కొంత కాలంగా రవితేజకు సాలిడ్​ హిట్​ పడటం లేదు. 'ధమాకా', ' క్రాక్' మినహా, 'రావణాసుర','రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడి', 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు' లాంటి సినిమాలు బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయాయి. దీంతో 'ఈగల్' సినిమా అయినా భారీ హిట్​ సాధించి రవితేజను మళ్లీ ఫామ్​లోకి వచ్చేలా చేయాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Ravi Teja Silpa shetty : మాస్ మహారాజాతో శిల్పాశెట్టి డ్యాన్స్​.. స్టెప్పులు అదిరిపోయాయి బాసూ!

Ravi Teja New Movie RT4GM : రవితేజ - గోపిచంద్ కాంబో రిపీట్.. కీలక పాత్రలో ఆ డైరెక్టర్​ ఫిక్స్

Last Updated : Nov 2, 2023, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.