ఓ వైపు హరీశ్- పవన్ కాంబోలో రావాల్సిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకా సెట్స్‌లోకి అడుగుపెట్టకముందే మరో క్రేజీ ప్రోజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చేశారు దర్శకుడు హరీశ్ శంకర్. అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్' సినిమాకు సైన్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ ఆ తర్వాత ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజ ఇచ్చారు. 'ఉస్తాద్' సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు తెలిపి అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో పాటే మాస్ మహారాజ రవితేజతో ఓ సినిమా తీయనున్నట్లు కూడా చెప్పారు.
-
And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023
మాస్ మహారాజతో పీరియాడికల్ డ్రామా..
ప్రస్తుతం రావణాసుర చిత్ర ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్న మాస్ మహారాజా రవితేజ.. అభిమానులతో ట్విటర్ వేదికగా మచ్చటించారు. ఇందులో భాగంగా నిర్వహించిన 'క్యూ అండ్ ఏ'లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని హరీశ్ శంకర్‌తో మళ్లీ మూవీ ఎప్పుడు చేస్తారు అని అడిగాడు. ఇదే ప్రశ్నకు హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేస్తూ రవితేజ కూడా అదే ప్రశ్నను అడిగారు. "ఏమ్మా హరీష్ శంకర్ ఏదో అడుగుతున్నారు నిన్నే.." అంటూ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా దర్శకుడిని అడిగారు.
అందుకు హరీశ్ కూడా రిప్లై ఇచ్చారు. "హా హా.. అన్నయ్యతో ఎప్పుడూ సినిమాకు రెడీనే. వాస్తవానికి ఓ పీరియడ్ డ్రామాపై పనిచేస్తున్నాం. త్వరలోనే మేము చరిత్రను తిరగరాస్తాం. థ్యాంక్యూ రవితేజ అన్నయ్య." అని అన్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో సినిమా రానుందన్న విషయం కన్ఫార్మ్ అయ్యింది.
ఇక వార్త విన్న మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. హరీశ్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్‌తో రవితేజ జతకట్టారంటే.. ఇక బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ అంచనాలు పెంచేసుకుంటున్నారు. అంతే కాకుండా కామెడీ, మాస్ యాక్షన్ కాకుండా ఇప్పుడు పీరియడ్ డ్రామా అనగానే ఈ సినిమా పై ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ప్రస్తుతం రవితేజ నటించిన 'రావణాసుర' ఈ నెల 7న రిలీజయ్యేందుకు రెడీగా ఉంది. హర్ష వర్ధన్ రామేశ్వర్-భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ సుశాంత్ ఓ కీలక పాత్రలో నటించారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
-
Ha ha ha ha ha
— Harish Shankar .S (@harish2you) April 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Annaya tho always ready in fact working on a period drama …. Very Soon We r going to repeat history … thank you annayya @RaviTeja_offl 🤗🤗🤗🤗 https://t.co/5pppddUzJP
">Ha ha ha ha ha
— Harish Shankar .S (@harish2you) April 4, 2023
Annaya tho always ready in fact working on a period drama …. Very Soon We r going to repeat history … thank you annayya @RaviTeja_offl 🤗🤗🤗🤗 https://t.co/5pppddUzJPHa ha ha ha ha
— Harish Shankar .S (@harish2you) April 4, 2023
Annaya tho always ready in fact working on a period drama …. Very Soon We r going to repeat history … thank you annayya @RaviTeja_offl 🤗🤗🤗🤗 https://t.co/5pppddUzJP