ETV Bharat / entertainment

విజయ్​ సరసన రష్మిక ఫిక్స్​- పీవీఆర్, ఐనాక్స్​పై ఆర్జీవీ ఫైర్​ - dahanam series

దిల్​రాజు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న సినిమాలో రష్మిక హీరోయిన్​గా ఎంపికైంది. పీవీఆర్, ఐనాక్స్ థియేటర్ల యాజమాన్యాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫైర్​ అయ్యారు. ఆయన తెరకెక్కించిన డేంజరెస్ చిత్రాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

movie updates
మూవీ అప్డేట్స్​
author img

By

Published : Apr 5, 2022, 9:50 PM IST

Updated : Apr 5, 2022, 10:55 PM IST

ప్రముఖ నిర్మాత దిల్​రాజు నిర్మాణ సారథ్యంలో కోలీవుడ్​ స్టార్ విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకుడిగా ఓ సినిమా రానున్న విషయం తెసిసిందే. దిల్​రాజు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ సినిమాకు సంబంధించి అప్డేట్​ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్​ను ఖరారు చేసింది నిర్మాణ సంస్థ. విజయ్​ సరసన నేషనల్​ క్రష్​.. రష్మికను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ సినిమాలో ఎంపిక కావడం వల్ల రష్మిక జాక్​పాట్​ కొట్టిందనే చెప్పాలి. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. మరో పెద్ద సినిమా తన ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్​ఎస్​ థమన్​ను ఎంపిక చేశారు దిల్​రాజు. ఈ సినిమా విజయ్​ 66వది కావడం గమనార్హం.

rashmika
రష్మిక
taman
తమన్​

డేంజరెస్ థియేటర్​ కష్టాలు: పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు డేంజరెస్ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అంగీకరించడం లేదని ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. స్వలింగసంపర్కుల నేపథ్యంగా సినిమా తీయడమే ఇందుకు కారణమని భావిస్తున్నట్లు వర్మ తెలిపారు. స్వలింగ సంపర్కం తప్పు కాదని సుప్రీంకోర్టు సెక్షన్ 377 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసిందని, సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం తెలుపలేదని వర్మ పేర్కొన్నారు. పీవీఆర్, ఐనాన్స్ సంస్థలు స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మానవ హక్కులను కించపరుస్తున్నాయని వర్మ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో స్వలింగ సంపర్కులతోపాటు ప్రతి ఒక్కరు ఐనాక్స్, పీవీఆర్ సంస్థల తీరును వ్యతిరేకించాలని వర్మ కోరారు. ఈ నెల 8న డేంజరెస్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

dangerous
డేంజరెస్

ఏప్రిల్ 14న: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాతగా మారి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'దహనం'. ఏప్రిల్ 14 నుంచి ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి హైదరాబాద్ లో వర్మ దహనం విశేషాలను వెల్లడించారు. ఓ కమ్యునిస్టు నేత హత్య, గొరిల్లా తరహా పోరాటం నేపథ్యంగా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని రామ్‌ గోపాల్‌వర్మ తెలిపారు. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తానన్నారు. నైనా గంగూలీ, అభిషేక్ దుహాన్, అభిలాష్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా అగస్త్యమంజు దర్శకత్వం వహించారు.

dahanam
దహనం

Last Updated : Apr 5, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.