ETV Bharat / entertainment

రణ్​వీర్​ సింగ్​కు అరుదైన గౌరవం.. పాపులర్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ఆ మూడు సినిమాలు.. - రణ్​వీర్​ సింగ్​ లేటెస్ట్​ అప్డేట్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్​కు అరుదైన గౌరవం దక్కంది. ఆయన నటించిన 'బాజీరావ్ మస్తానీ', 'గల్లీ బాయ్', 'పద్మావత్' సినిమాలను మర్రకేచ్​ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రదర్శించనున్నారు.

ranveer singh awarded with Etoile d'Or
ranveer singh
author img

By

Published : Nov 10, 2022, 8:16 PM IST

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్​కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ ఐజాక్, మారియన్ కోటిల్లార్డ్, టిల్డా స్వింటన్ వంటి సినీ దిగ్గజాల సమక్షంలో మొరాకోలోని 'మర్రకేచ్​ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌'లో ఆయన నటించిన 'బాజీరావ్ మస్తానీ', 'గల్లీ బాయ్', 'పద్మావత్' సినిమాలను ప్రదర్శించనున్నారు.

ఈ ప్రదర్శనకు పాలో సోరెంటినో, జేమ్స్ గ్రే, మారియన్ కోటిల్లార్డ్, సుజానే బీర్, ఆస్కార్ ఐజాక్, వెనెస్సా కిర్బీ, డయాన్ క్రుగర్, జస్టిన్ కుర్జెల్, ఎస్సీ డేవిస్, నాడిన్ లబాకి, లాఏ-లా మరాక్చి, తాహర్ రహీమ్ వంటి ప్రముఖులు హాజరవ్వనున్నారు. 19వ ఎడిషన్‌లోని మరాకెచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్‌వీర్‌ను ఎటోయిల్ డి'ఓర్ అవార్డుతో సత్కరించనున్నారు. గతంలో ఈ అవార్డును అమితాబ్ బచ్చన్, షారుక్​ ఖాన్, ఆమిర్ ఖాన్ అందుకున్నారు. నవంబర్ 11 నుంచి 13 వరకు మొరాకో నగరంలో జరగనున్న ఈ ఫిల్మ్​ ఫెస్టివల్​కు రణ్​వీర్​ సింగ్​ హాజరవ్వనున్నారు.

ఇదీ చదవండి:కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సంచలన చిత్రం.. 'ది వ్యాక్సిన్ వార్'

ఈ వారం OTTలోకి 15కుపైగా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు.. అవేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.