ETV Bharat / entertainment

రణ్​వీర్​ సాహసం.. ఎలుగుబంటితో పోరాటం! - ఎలుగుబంటి రణ్​వీర్​ సింగ్​

Bear grylls Ranveer singh: మన దేశానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్​, అజయ్​దేవగణ్​, విక్కీకౌశల్​లతో సాహసాలు చేయించిన సాహసికుడు బేర్ గ్రిల్స్​.. ఈసారి మరో బాలీవుడ్​ హీరో రణ్​వీర్​సింగ్​తో అదిరిపోయే అడ్వెంచర్​లు చేయించారు. దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఎపిసోడ్ జులై 8న ప్రసారం కానుంది. ​

Ranveer Singh vs bear grylls
రణ్​వీర్​ సింగ్​ బేర్​ గ్రిల్స్​
author img

By

Published : Jun 11, 2022, 9:45 AM IST

Bear grylls Ranveer singh: ప్రముఖ మనుగడ పోరాటాల వీరుడు బేర్ గ్రిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడవీ ప్రాంతాలు, కొండలు, లోయలు, సముద్రాలు, నదీ తీరాల వెంట ప్రయాణిస్తూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆయన చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడుస్తుంటాయి.

ఇప్పటికే ఆయన ప్రధాన నరేంద్ర మోదీ, బాలీవుడ్​ స్టార్ అక్షయ్​కుమార్​, అజయ్​దేవగణ్​, విక్కీ కౌశల్​, సూపర్​స్టార్​ రజనీకాంత్​తో చేసిన సాహసాలు గూస్​బంప్స్​ తెప్పించాయి. అయితే ఇప్పుడు మరో స్టార్​ హీరోతో సాహస యాత్రను చేశారు. బాలీవుడ్​ యాక్టర్ రణ్​వీర్ సింగ్​తో కలిసి కళ్లు చెదిరే అడ్వెంచర్స్​ చేశారు. దీనికి సంబంధించిన టీజర్​ విడుదలైంది. ఇందులో రణ్​వీర్ దట్టమైన అడవుల్లో​ ఓ భయంకరమైన ఎలుగుబంటి నుంచి తప్పించుకుంటున్నట్లు, ఎత్తైన పర్వతాలను రోప్​ సాయంతో దాటుతూ కనిపించారు. 'రణ్​వీర్​ వర్సెస్​ వైల్డ్​ విత్​ బేర్​ గ్రిల్స్'​ పేరుతో రానున్న ఈ కార్యక్రమం జులైన 8న నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అసలు పెళ్లే వద్దనుకున్నాడు.. ఇప్పుడు ఆమెతో పీకల్లోతు ప్రేమలో.. ఆ ఒక్క ఇంటర్వ్యూతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.