ETV Bharat / entertainment

Ranbir Kapoor Rashid Khan : వెకేషన్​లో రణ్​బీర్​-ఆలియా.. స్టార్​ క్రికెటర్ స్వీట్​ సర్​ప్రైజ్​!​

Ranbir Kapoor Rashid Khan : బాలీవుడ్ స్టార్​ కపుల్​ ఆలియా భట్​- రణ్​బీర్ కపూర్​​ ప్రస్తుతం వెకేషన్​లో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంటను అఫ్గానిస్థాన్​ స్టార్​ ప్లేయర్​ రషీద్​ ఖాన్ కలిశాడు. వాళ్లిద్దరితో కలిసి దిగిన ఓ ఫొటోను రషీద్​ తన ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో షేర్ చేశాడు.

Ranbir Kapoor Rashid Khan
Ranbir Kapoor Rashid Khan
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 10:56 AM IST

Ranbir Kapoor Rashid Khan : బాలీవుడ్ స్టార్​ కపుల్​ ఆలియా భట్​- రణ్​బీర్ కపూర్​​ ప్రస్తుతం వెకేషన్​లో ఉన్నారు. బిజీ షెడ్యూల్స్​ను పక్కనబెట్టిన ఈ జంట.. తమ గారాలపట్టి రాహాతో న్యూయార్క్​ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంటను అఫ్గానిస్థాన్​ స్టార్​ ప్లేయర్​ రషీద్​ ఖాన్ కలిశాడు. వాళ్లిద్దరితో కలిసి దిగిన ఓ ఫొటోను రషీద్​ తన ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో షేర్ చేశాడు. "బాలీవుడ్‌ బిగ్గెస్ట్ స్టార్స్​.. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది #Ranbir, aliaabhatt." అంటూ ఓ స్వీట్​ క్యాఫ్షన్​ను రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్​ అవుతోంది.

అంతకుముందు ఆలియా తన ఫ్యాన్స్​ కోసం ఓ వీడియోను షేర్​ చేశారు. అందులో స్విమ్మింగ్​ ఫూల్​లో సేదతీరుతూ కనిపించిన ఆలియా ఇది నా వీక్​ ఆఫ్​ ​షెడ్యూల్​ అంటూ చెప్పుకొచ్చారు. ఆ వీడియోపై పలువురు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కామెంట్లు పెట్టారు.

Alia Bhatt Movies : ఇక ఆలియా తాజాగా నేషనల్​ అవార్డులకు ఎంపికైంది. తాను నటించిన గంగూభాయ్​ కఠియావాది సినిమాకుగానూ తనకు ఈ అవార్డు దక్కింది. అయితే వెకేషన్​కు ముందు ఆలియా.. రాకీ ఔర్​ రాణికీ ప్రేమ్​ కహానీ అనే సినిమాలో మెరిశారు. రణ్​వీర్​ సింగ్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్​ తెరకెక్కించారు. భారీ బడ్డెట్​తో రూపొందిన ఈ సినిమాలో జయా బచ్చన్​, ధర్మేంద్ర, షబానా అజ్మీ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లు అందుకుంది.

Ranbir Kapoor Animal Movie : 'బ్రహ్మాస్త్ర' సినిమాతో గతేడాది ప్రేక్షకులను పలకరించిన రణ్​బీర్​ సింగ్​ ప్రస్తుతం అనిమల్​ అనే యాక్షన్ థ్రిల్లర్​లో నటిస్తున్నారు. అర్జున్​ రెడ్డి ఫేమ్​ దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో రణ్​బీర్​ మునుపెన్నడు లేని లుక్​లో కనిపించారు. దీంతో ఫ్యాన్స్​కు ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన టీజర్​ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Animal Teaser : వైల్డ్​గా రణ్​బీర్​ 'యానిమల్' టీజర్​

National Film Awards 2021 Winners : జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. నటిగా ఆలియా భట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.