ETV Bharat / entertainment

Ranbir kapoor Movie Break : రణ్​​బీర్ షాకింగ్ డెసిషన్.. సినిమాలకు బ్రేక్.. ఆమె కోసమే! - రన్​బీర్ కపూర్ కూతురి పేరు

Ranbir kapoor Movie Break : బాలీవుడ్​ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్ సినిమాలకు ఆరు నెలల పాటు విరామం ప్రకటించారు. 'యానిమల్​' తరువాత ఏ సినిమాకు అంగీకరించలేదని తెలిపారు. ఈ ఆరు నెలలు రణ్​బీర్​ ఏమి చేస్తున్నారంటే..

Ranbir kapoor Movie Break
Ranbir kapoor Movie Break
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 3:24 PM IST

Updated : Oct 25, 2023, 3:50 PM IST

Ranbir kapoor Movie Break : బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్ - సందీప్​ రెడ్డి వంగా కాంబోలో 'యానిమల్​' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్​ 1న విడుదల కానున్నట్లు మూవీటీమ్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ స్టార్ హీరో యానిమల్​' తర్వాత మరే సినిమాలను ఓకే చేయలేదంట. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీనికి గల కారణాన్ని తెలిపారు రణ్​బీర్​ కపూర్. ఈ సినిమా అనంతరం ఆరు నెలల పాటు విరామం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ సమయాన్ని తన కూతురితో కలిసి సమయాన్ని గడపడానికే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు.

"కొన్ని నెలల పాటు మా కూతురు రాహాతో సమయాన్ని గడపాలనుకుంటున్నా. నా సినిమా షెడ్యూల్​ కారణంగా తను పుట్టాక ఎక్కువ సమయం పాపతో గడపలేకపోయాను. అందుకే ఇప్పుడు ఆరు నెలలు రాహాతో ఉండాలనుకుంటున్నా. అందుకే యానిమల్ తర్వాత మరే సినిమాను అంగీకరించలేదు. రాహా ఇప్పుడే అన్నింటినీ గుర్తిస్తోంది. ప్రేమను వ్యక్తపరుస్తోంది. మాట్లడటానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి అందమైన క్షణాలను నేను ఆస్వాదించాలనుకుంటున్నాను." అని రణ్​బీర్​ కపూర్ ​ఇంటర్వ్యూలో తెలిపారు. బాలీవుడ్​ హీరోయిన్ అలియా భట్ - రణ్​బీర్​ కపూర్ గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు 2022 నవంబర్​ 6న ఆడబిడ్డ జన్మించింది. ​

ఇక సినిమాల విషయానికొస్తే.. గ్యాంగ్​స్టర్ నేపథ్యంలో 'యానిమల్' సినిమాను భారీ బడ్జెట్​తో పాన్​ ఇండియా రేంజ్​లో రూపొందిస్తున్నారు. ఇందులో రణ్​బీర్​కు జోడీగా రష్మిక మందాన నటిస్తోంది. అనిల్ కపూర్​ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల విడుదల మూవీ మేకర్స్ విడుదల చేసిన టీజర్​కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీని తర్వాత దర్శకుడు నితేశ్ తివారీ బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న.. రామాయణంలో రాముడిపాత్రలో రణ్‌బీర్‌ కనిపించనున్నట్లు సమాచారం. దీని కోసం ఇప్పటికే ఆయనకు లుక్‌ టెస్ట్ చేసినట్లు టాక్. ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నట్లు ఆ మధ్య బీటౌన్​లో వార్తలు వచ్చాయి. ఇక తర్వలోనే అయాన్​ ముఖర్జీతో కలిసి రన్​బీర్.. 'బ్రహ్మాస్త్ర-2' చేయనున్నారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Animal Teaser : 'యానిమల్' టీజర్ ఔట్.. ఫుల్ వైలెన్స్​​ సీన్స్​తో మరింత ఇంట్రెస్టింగ్​గా!

Animal Teaser : వైల్డ్​గా రణ్​బీర్​ 'యానిమల్' టీజర్​

Last Updated : Oct 25, 2023, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.