తమ గారాలపట్టికి అలియాభట్, రణ్‌బీర్‌కపూర్‌లు నామకరణం చేశారు. కూతురికి రాహా అని పేరు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వివిధ భాషల్లో ఆ పేరుకు అర్థమేంటో వివరించారు. రాహా అంటే దైవ మార్గమని, స్వాహిలి భాషలో ఆనందమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్‌లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ అని చెప్పారు. తన భర్త రణ్‌బీర్ ఆ పేరును నిర్ణయించారని అలియా భట్ తెలిపారు.
రాహా రాకతో తమ జీవితం కొత్తగా ప్రారంభమైందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు పేరు బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. అలియా, రణ్‌బీర్ తమ చిన్నారిని మాత్రం చూపించలేదు. కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహబంధంలోకి అడుగు పెట్టారు. నవంబరు 6న పాపకు జన్మనిచ్చారు.
ఇదీ చూడండి: మోస్ట్ టాప్ 10 పాపులర్ హీరోయిన్స్ ఈ ముద్దుగుమ్మలే