Rana Naidu Season 2 Update : టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ - శైలేష్ కొలను కాంబోలో రానున్న సినిమా 'సైంధవ్'. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ పాయింట్‌తో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న వెంకటేశ్.. 'రానా నాయుడు' వెబ్ సిరీస్ సీక్వెల్ గురించి మాట్లాడారు.
'సైంధవ్' సాంగ్ రిలీజ్ ప్రోగ్రామ్‌ను ఓ కాలేజీలో నిర్వహించారు. అయితే అక్కడ 'రానా నాయుడు' రెండో పార్ట్ గురించి ఓ స్టూడెంట్ అడగ్గా.. వెంకీ ఆయన రీతిలో సమాధానమిచ్చారు. ' రానా నాయుడు, వెళ్తున్ననామ్మ. జనవరి నుంచి స్టార్ అవుతుంది. నాగా నాయుడు మామూలోడు కాదు. నెట్‌ఫ్లిక్స్ వాళ్లు తీశారు. వరల్డ్‌వైడ్‌గా అందరూ చూసేశారు. మళ్లీ తీయమంటున్నారు. కుర్రాళ్లు చూశారు కానీ.. పెద్దవాళ్లు ఏంటి అలా చేశావ్'అని అన్నారన్నారు. అయితే రెండో పార్ట్‌లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ, ఎవరినీ హర్ట్ చేయకుండా చూసుకుంటాన్నారు వెంకటేశ్. ఫస్ట్ సీజన్ చూసి చాలా మంది హర్ట్ అయ్యారు.. కానీ ఈసారి చక్కగా ఉంటుందని వెంకీ తెలిపారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా.. రెండో సీనన్లో బోల్డ్ సీన్స్, బూతులు తగ్గవచ్చని అంటున్నారు.
-
"కుర్రోళ్లు ఏమో Encourage చేస్తున్నారు, పెద్దోళ్లు ఏమో ఏంట్రా నాన్న అలా చేసావ్ నువ్వు అన్నారు" - #Venkatesh Confirms #RanaNaidu Part-2 pic.twitter.com/zenFLRy3vW
— Daily Culture (@DailyCultureYT) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"కుర్రోళ్లు ఏమో Encourage చేస్తున్నారు, పెద్దోళ్లు ఏమో ఏంట్రా నాన్న అలా చేసావ్ నువ్వు అన్నారు" - #Venkatesh Confirms #RanaNaidu Part-2 pic.twitter.com/zenFLRy3vW
— Daily Culture (@DailyCultureYT) November 21, 2023"కుర్రోళ్లు ఏమో Encourage చేస్తున్నారు, పెద్దోళ్లు ఏమో ఏంట్రా నాన్న అలా చేసావ్ నువ్వు అన్నారు" - #Venkatesh Confirms #RanaNaidu Part-2 pic.twitter.com/zenFLRy3vW
— Daily Culture (@DailyCultureYT) November 21, 2023
Rana Naidu Season 1 : హాలీవుడ్ వెబ్సరీస్ 'రే డొనోవన్' ఆధారంగా ఇండియన్ నేటివిటికి తగ్గట్లుగా రూపొందింది రానా నాయుడు. ఈ వెబ్‌సిరీస్‌లో టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కూడా నటించారు. దీనికి సుపర్న్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు. పలు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువైందని పబ్లిక్ టాక్. దీనికి తెలుగులో కంటే హిందీ, ఇతర భాషల్లో ఎక్కువ స్పందన వచ్చింది.
ఇక సైంధవ్ విషయానికొస్తే.. 'రాంగ్ యూసేజ్' అనే పాటను మంగళవారం రిలీజ్ చేసింది మూవీయూనిట్. ఇదివరకే విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక నిర్మాత వెంకట్ బోయనపల్లి.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Saindhav Teaser : సైకో సైంధవ్.. వెంకటేశ్ ఊచకోత.. పవర్‌ఫుల్‌గా యాక్షన్ టీజర్
Saindhav Release Date : సంక్రాంతి బరిలో పెద్దోడు X చిన్నోడు.. వెంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!