ETV Bharat / entertainment

ఆ దర్శకుడికి క్షమాపణలు చెప్పిన రామ్​.. ఎందుకంటే?

ప్రముఖ దర్శకుడికి హీరో రామ్​పోతినేని సోషల్​మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. దానికి స్పందించిన సదరు డైరెక్టర్.. '​ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను' అని రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ram potineni
రామ్​ పోతినేని
author img

By

Published : Jun 23, 2022, 10:18 AM IST

Rampotineni says sorry to director linguswamy: కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడికి.. టాలీవుడ్‌ హీరో రామ్‌ పోతినేని క్షమాపణలు చెప్పారు. సోషల్‌మీడియా వేదికగా సారీ చెబుతూ ఓ ట్వీట్‌ పెట్టారు. రామ్‌ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'ది వారియర్‌'. దీనికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా సిద్ధమవుతోంది. కృతిశెట్టి కథానాయిక. వచ్చే నెలలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే 'ది వారియర్‌' ప్రమోషన్స్‌ను చిత్రబృందం షురూ చేసింది. ఇందులో భాగంగా 'విజిల్‌' అంటూ సాగే ఓ హై ఓల్టేజ్‌ పాటను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. సాంగ్​ రిలీజ్​ కోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

రామ్‌ మాట్లాడుతూ.. 'విజిల్‌' సాంగ్‌ తనకెంతో నచ్చిందని.. తమ చిత్రానికి ఇంతటి ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌, సింగర్స్‌, నిర్మాతలు, ఇతర చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. అయితే ఆయన స్టేజ్‌పై ఇచ్చిన స్పీచ్‌లో దర్శకుడు లింగుస్వామి గురించి చెప్పడం మర్చిపోయారు. ఇదే విషయాన్ని గ్రహించిన రామ్‌ ట్విటర్‌ వేదికగా ఆయనకు క్షమాపణలు చెప్పారు. "ఈ చిత్రం తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్‌, డైరెక్టర్‌ లింగుస్వామి!! ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ని మీరు మీ భుజాలపైకి ఎత్తుకున్నారు. ఇప్పటివరకూ నేను పనిచేసిన ఉత్తమమైన దర్శకుల్లో మీరూ ఒక్కరిగా ఉన్నందుకు ధన్యవాదాలు. సారీ అండ్‌ లవ్‌ యూ" అని రామ్‌ రాసుకొచ్చారు.

రామ్‌ పెట్టిన ట్వీట్‌పై లింగుస్వామి స్పందించారు. "నాతో కలిసి పనిచేయడాన్ని నువ్వు ఎంతలా ఇష్టపడ్డావో నాకు తెలుసు. అలాగే, సినిమా చూసిన అనంతరం ఆత్మీయంగా నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్నావ్‌ కదా.. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మనం మరింత దూరం ప్రయాణించాలని కోరుకుంటున్ని" అని బదులిచ్చారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ సినిమా నిర్మితమైంది. ఇందులో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: బాలయ్య 'అన్​స్టాపబుల్​'లో మెగాస్టార్​.. షారుక్​ సినిమాలో రానా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.