ETV Bharat / entertainment

అమెరికాలో రామ్​ చరణ్​కు అరుదైన గౌరవం.. తొలి తెలుగు హీరోగా రికార్డు!

ఆస్కార్​ వేడుకల కోసం అమెరికా వెళ్లిన మెగాపవర్​ స్టార్ రామ్​చరణ్​ ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవం ఆయనకు లభించింది. ఆ వివరాలు..

ramcharan america talk show
అమెరికాలో రామ్​ చరణ్​కు అరుదైన గౌరవం
author img

By

Published : Feb 22, 2023, 7:59 PM IST

రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​ సినిమా ఇండియన్​ ఆడియెన్స్​తో పాటు హాలీవుడ్ దిగ్గజ దర్శకులను సైతం ఆకట్టుకుంది. జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి టాప్​ డైరెక్టర్స్​ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. అలా ఇంత వరకూ ఏ ఇండియన్ చిత్రం సాధించలేని ఘనతలను ఆర్​ఆర్​ఆర్ అంతర్జాతీయ వేదికలపై​ అందుకుంటోంది. ఇప్పటికీ ఈ మూవీ హీరోలు, డైరెక్టర్​కు, మిగితా టెక్నిషియన్స్​కు ఏదో ఒక గౌరవం లభిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​కు అరుదైన గౌరవం దక్కింది.

అదేంటంటే.. ఇప్పటికే ఈ చిత్రం ఆస్కార్ రేస్​లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా నాటు నాటు సాంగ్​ ఆస్కార్​ బెస్ట్ ఒరిజినల్​ సాంగ్​ విభాగంలో నామినేట్​ అయింది. అలాగే ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్​తో పాటు గోల్డెన్​ గ్లోబ్​, క్రిటిక్స్​ ఛాయిస్​ అవార్డులను కూడా ముద్దాడింది. ఈ క్రమంలోనే తాజాగా హెచ్​సీఏ ప్రదానం చేయనున్న అవార్డు నామినేషన్స్​కు ఎంపికైంది. ఈ వేడుకలో రామ్​చరణ్​ ప్రజెంటర్​గా వ్యవహరించనున్నారు. మార్చి 12న ఈ ఆస్కార్ వేడుకలు, ఫిబ్రవరి 24న ఈ హెచ్​సీఏ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.

దీంతో చరణ్​ రీసెంట్​గా.. ఆస్కార్ ప్రమోషన్స్ సహా ప్రతిష్టాత్మకమైన హెచ్​సీఏ అవార్డ్స్​ కోసం అమెరికా వెళ్లారు​. హాలీవుడ్ మీడియాతో తనదైన స్టైల్​లో ముచ్చటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే అక్కడ ఆయనకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రామ్​ టాక్​ షో గుడ్ మార్నింగ్ అమెరికాలో ఆయన పాల్గొన్నారు. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రామ్ చరణే కావడం విశేషం. భారత సమయం ప్రకారం ఈ షో నేడు(ఫిబ్రవరి 22)న రాత్రి 11.30 గంటలకు ప్రసారం కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎక్స్ పీరియన్స్​తో పాటు కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఈ షోలో చరణ్​ మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

అమెరికా పర్యటనలో రామ్​చరణ్​.. కాళ్లకి చెప్పులు లేకుండానే..

రామ్​ చరణ్​ సాంగ్​కు రణ్​బీర్​ కపూర్​ స్టెప్పులు.. వీడియో సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.