Ramcharan Buchi Babu Movie : 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు - మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబోలో 'ఆర్సీ 16'(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించినప్పటికీ... ఇంకా సెట్స్‌పైకి కూడా వెళ్లలేదు. ఈ సినిమా ఎప్పడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభించుకుంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ స్కిప్ట్ వర్క్ ఆలస్యం కావడం సహా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రంతో కాస్త బిజీగా ఉండటం వల్ల.. చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రస్తుతం చిత్రసీమలో నడుస్తున్న ఓ కొత్త ట్రెండ్‌లో భాగం కానుందని టాక్ వినిపిస్తోంది.
అదేంటంటే?.. బాహుబలి, కేజీయఫ్ సిరీస్ చిత్రాలతో రెండు భాగాల ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. నిర్ణీత నిడివిలో చెప్పలేమనుకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీస్‌ను... భాగాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన దర్శకనిర్మాతలు. ఇది కమర్షియల్గానూ మంచి లాభదాయకంగా ఉండటం వల్ల.. ఈ ట్రెండ్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. తొలి పార్ట్ క్లైమాక్స్‌లో సస్పెన్స్ పెట్టి.. దాని రెండో భాగంలో రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.
ఇటీవలే ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా అనౌన్స్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఇప్పుడు ఆర్సీ 16 కూడా ఇదే ఫార్మూలాను ఫాలో కానుందని తెలిసింది. ఈ మధ్యే ఈ సినిమా కథ పూర్తైందని తెలిసింది. అయితే ఈ కథ చాలా పెద్దగా ఉందని, అందుకే దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్లు ప్రచారం మొదలైంది.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. ఇకపోతే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారని ఆ మధ్య బుచ్చిబాబు స్పష్టత ఇచ్చారు. సినిమా రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని అందరు అనుకుంటున్నారని, కానీ ఇది వాళ్లందరి అంచనాలకు మించి ఉంటుందని అన్నారు.
2024 Pan India Movies : టాలీవుడ్ నుంచి ఆ 5 సినిమాలు ఒకే.. కానీ ఇవి మాత్రం కాస్త డౌటే!