ETV Bharat / entertainment

ప్రతి తరానికీ రవితేజ లాంటి వారుంటారు.. అది మాటల్లో చెప్తే అర్థం కాదు: నాని - రామారావు అన్ డ్యూటీ ప్రీరిలీజ్​

రవితేజ ప్రభుత్వాధికారిగా నటించిన చిత్రం 'రామారావు ఆన్‌ డ్యూటీ'. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా శరత్‌మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్​కు నటుడు నాని, దర్శకుడు బాబీ ముఖ్య అతిథులుగా హాజరై, సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోలు నాని, రవితేజ తదితరులు మాట్లాడారు. అవి వారి మాటల్లోనే..

Ramarao On Duty Movie Pre Release Event:

author img

By

Published : Jul 25, 2022, 7:06 AM IST

Ramarao On Duty Movie Pre Release Event: "నేను సాధించాను.. మీరెందుకు సాధించలేరు' అని ధైర్యాన్నిచ్చే వాడు ప్రతి జనరేషన్‌కీ ఒకడుంటాడు. కెరీర్‌ తొలినాళ్లలో మాకలాంటి ధైర్యాన్నిచ్చిన వ్యక్తి రవితేజ అన్న" అన్నారు కథానాయకుడు నాని. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్ర విడుదల ముందస్తు వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రమిది. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు.

Ramarao On Duty Movie Pre Release Event:
.

Hero Nani Speech: ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. "ఈ వేడుకకు అతిథిగా రాలేదు. రవితేజ అన్న గురించి మాట్లాడే అవకాశం వచ్చిందని వచ్చా. తనకి చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు చిరుని స్ఫూర్తిగా తీసుకున్నారు. మేము కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు మాకలాంటి స్ఫూర్తినిచ్చింది రవి అన్న. తను చిరంజీవి క్యారవ్యాన్‌లోకి వెళ్లిన సీన్‌ చూశా. త్వరలో నేనూ తన క్యారవాన్‌లోకి అలా అడుగు పెట్టాలనుకుంటున్నా. 'రామారావు ఆన్‌ డ్యూటీ'పై మొదటి నుంచీ నాకు చాలా పాజిటీవ్‌ వైబ్‌ ఉంది. టీజర్లు, ట్రైలర్లు చూశాక నా నమ్మకం మరింత పెరిగింది. ఈ చిత్రంలో అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. 20ఏళ్ల నుంచి రవితేజ ఆన్‌ డ్యూటీ. ఈనెల 29 నుంచి 'రామారావు ఆన్‌ డ్యూటీ'' అన్నారు. "మాస్‌ మహరాజ్‌ను పట్టుకుంటే లైఫ్‌ సెట్టయిపోద్ది. దానికి నేనొక ఉదాహరణ. 'బలుపు' చిత్రంతో నా జీవితమే మారిపోయింది. జీవితాల్ని సెట్‌ చేయడమే కాదు.. రీసెట్‌ చేయగలరాయన. 'మెగా154'లో రవితేజ పాత్ర అభిమానులు విజిల్స్‌ వేసుకునేలా ఉంటుంది" అన్నారు దర్శకుడు బాబీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కథానాయకుడు రవితేజ మాట్లాడుతూ.. "ఈ వేడుకకు అతిథిగా వచ్చినందుకు నానికి థ్యాంక్స్‌. దక్షిణాదిలోనే బెస్ట్‌ నటుడు తను. తొలిసారి అందరూ కొత్తవాళ్లతో పనిచేస్తున్నా. శరత్‌ చాలా బాగా తీశారు. నేను గతంలో ఎప్పుడూ చేయని సరికొత్త కథను, పాత్రను ఈ చిత్రంతో చేశా. అప్పట్లో వేణు తొట్టెంపూడితో 'స్వయంవరం' సినిమా చేయాల్సింది. కుదర్లేదు. ఇన్నాళ్లకు ఈ చిత్రంతో మళ్లీ కలిశాం. ఇక మళ్లీ గ్యాప్‌ ఇవ్వకు వేణు. ఈ కథ విన్నప్పుడే సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా సత్యన్‌ సూర్యన్‌ను తీసుకోవాలనుకున్నాం. ఈ చిత్రానికి సంగీతం ప్రాణం. సామ్‌ సిఎస్‌ నేపథ్య సంగీతం వింటే చెవులకు పట్టిన తుప్పు వదిలిపోతుంది" అన్నారు.

  • "ఓ వ్యక్తిగా రవితేజని నేనెంతో ఇష్టపడతా. ఈ సినిమాతో ఆయన నుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. నన్ను నమ్మి నాకీ అవకాశమిచ్చిన ఆయనకు ఈ వేదిక నుంచి తొలిసారి థ్యాంక్స్‌ చెబుతున్నా" అన్నారు చిత్ర దర్శకుడు శరత్‌.
  • నటుడు వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ "రవితేజ నటించిన ఈ సినిమాతో నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడుతున్నా. చాలా ఆనందంగా ఉంది" అన్నారు.
  • ఈ కార్యక్రమంలో దివ్యాంశ, రజిషా, అన్వేషి జైన్‌, వివేక్‌ కూచిభొట్ల, అభిషేక్‌ నామా, స్టంట్‌ శివ, కెఎల్‌ ప్రవీణ్‌, కల్యాణ చక్రవర్తి, సాహి సురేష్‌, సామ్‌ సిఎస్‌, సత్యన్‌ సూర్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: ఆ పని తొందర పడి చేయలా, గర్వపడి చేశా: చిరంజీవి

గుర్తుపట్టిన ఫ్యాన్స్​.. భయంతో పరుగెత్తిన షారుక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.