ETV Bharat / entertainment

Ram charan fashion : షారుక్-హృతిక్ కాదు.. ఆ స్టార్ హీరో ఫ్యాషన్ సెన్స్​ అంటే చాలా ఇష్టం : చరణ్​ - సైఫ్​ అలీ ఖాన్​ గురించి రామ్​ చరణ్​

Ram charan fashion : 'ఆర్​ఆర్​ఆర్'​తో ప్రపంచవ్యాప్తంగా​ భారీ హిట్ అందుకున్న మెగాపవర్​ స్టార్​ ఎవరూ ఊహించని ఓ పేరు చెప్పి షాక్ అండ్​ సర్​ప్రైజ్​కు గురి చేశారు. షారుక్, హృతిక్ పేర్లు కాదని మరో బాలీవుడ్​ యాక్టర్ పేరు చెప్పారు. ఆ సంగతులు..

Ram charan fashion
రామ్​చరణ్ ఫ్యాషన్ సెన్స్​
author img

By

Published : Jul 30, 2023, 2:19 PM IST

Updated : Jul 30, 2023, 5:05 PM IST

Ram charan fashion : 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా​ భారీ క్రేజ్​ సంపాదించుకున్న మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ ఎవరూ ఊహించని రేంజ్​కు ఎదిగారు. మెగా పవర్​ స్టార్​గా ఉన్న ఆయన ఒక్క సారిగా గ్లోబల్​ స్టార్ రేంజ్​కి ఎదిగిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా అది సెన్సేషనల్​ అవుతోంది. ఇక రీసెంట్​గా ఆయన తండ్రిగా ప్రమోషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్​ ప్రస్తుతం నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

సాధారణంగా ఎవరైనా దేశ వ్యాప్తంగా ఉన్న హీరోల్లో ఎవరి ఫ్యాషన్ సెన్స్​ నచ్చుతుందని అని అడిగితే.. వారు టక్కున చెప్పే పేర్లల్లో రణ్​వీర్​ సింగ్​, షారుక్ ఖాన్​, హృతిక్ రోషన్​ ఉంటారు. అభిమానులు మాత్రమే కాదు ఇతర స్టార్​ హీరోలు, యాక్టర్స్​ కూడా దాదాపుగా వీరి పేర్లే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. అప్పట్లో ప్రభాస్​ కూడా హృతిక్​ రోషన్​ యాక్టింగ్, స్టైల్​ నచ్చుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​.. మాత్రం ఎవరూ ఊహించని పేరు చెప్పి అందరిని సర్​ప్రైజ్ చేశారు.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఈ ప్రశ్నకు చెర్రీ.. బాలీవుడ్ ప్రముఖ నటుడు​ సైఫ్ అలీఖాన్ పేరును ప్రస్తావించారు. ఆయన ఫ్యాషన్స్ సెన్స్​, స్టైల్​ తనకెంతో ఇష్టమని చెర్రీ తెలిపారు. "ఓ రాజు కుటుంబంలో ఉండే ఠీవి, తేజస్సు సైఫ్​లో కనపడుతుంది. ఆర్గానిక్​గా కనిపిస్తారు. ఎక్కువగా హడావిడి చేసుందుకు ఆయన ప్రయత్నించరు. సింపుల్​గా ఉంటారు." అని చరణ్​ తెలిపారు.

అలాగే హీరోయిన్స్​లో​ స్టార్ హీరో రణ్​వీర్​ సింగ్ భార్య, ప్రముఖ కథానాయిక దీపికా పదుకొణె ఫ్యాషన్ సెన్స్​ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే పలు విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఈ విషయాలన్నింటినీ తన్మయ్​ భత్​ చేసిన యూట్యూబ్​ ఇంటర్వ్యూలో తెలిపారు.

Saif Ali Khan Movies : ఇక సైఫ్​ అలీఖాన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. బాలీవుడ్​లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా ఎదిగిన సైఫ్​.. ఇప్పుడు టాలీవుడ్​లోను వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. అలా తన నటనతో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు.
'ఆదిపురుష్'​ సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు 'దేవర'తో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రస్తుతం 'దేవర' సినిమా షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Ram Charan Movies : మరోవైపు రామ్​చరణ్​.. ప్రస్తుతం శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్​ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్​గా తెరకెక్కనున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్ డ్రామాలో లీడ్​ రోల్​లో కనిపించనున్నారు.

Last Updated : Jul 30, 2023, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.