ETV Bharat / entertainment

ఆర్​సీ15 పాట బడ్జెట్‌ తెలిస్తే వామ్మో.. అనాల్సిందే! - హీరో రామ్​ చరణ్ డైరెక్లర్​ శంకర్​ మూవీ

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ పాటకోసం ఎప్పుడూ లేనంత భారీగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

ram charan rc15 song budget
రామ్‌చరణ్‌ ఆర్​సీ15 పాట బడ్జెట్‌
author img

By

Published : Nov 16, 2022, 9:22 PM IST

Updated : Nov 16, 2022, 10:51 PM IST

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆర్​సీ 15గా ఈ చిత్రం ప్రచారంలో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటలకు కూడా భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో రూ.8 కోట్లతో ఓ పాట చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఫిల్మినగర్‌లో చక్కర్లు కొడుతోంది. అది విని చరణ్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇంతకి ఆ వార్త ఏమిటంటే ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ పాటను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారట.

ఈ పాటను నవంబర్ 20 నుంచి డిసెంబర్‌ 2 వరకు దాదాపు రెండు వారాలు చిత్రీకరించనున్నారు. రూ.15 కోట్లతో న్యూజిల్యాండ్‌లో ఈ పాటను షూట్‌ చేయనున్నారని టాక్‌. మాములుగానే శంకర్‌ సినిమాలోని పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయి. గతంలో జీన్స్‌ సినిమాలోని "పువ్వుల్లో దాగున్న" సాంగ్‌, అపరిచితుడు సినిమాలోని "ఓ సుకుమారి" ఇలా ప్రతి సినిమాలో శంకర్‌ ఓ పాటను అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీస్తారు. ఇప్పుడు రామ్‌ చరణ్‌, కియారా అడ్వాణీల ఈ పాట కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మాతగా రానున్న ఈ బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలకపాత్రలు పోషించనున్నారు.

Last Updated : Nov 16, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.