ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు రజనీకాంత్​ భారీ సర్​ప్రైజ్​.. మరో రెండు సినిమాలకు గ్రీన్​సిగ్నల్​ - రజనీకాంత్​ లైకా ప్రొడక్షన్స్​

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. మరో రెండు కొత్ర ప్రాజెక్ట్​లకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు.

rajnikanth fans surprise
ఫ్యాన్స్​కు రజనీకాంత్​ సర్​ప్రైజ్​
author img

By

Published : Oct 28, 2022, 8:34 PM IST

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో రెండు సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు వచ్చే నెల 5న చెన్నైలో జరగనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది నిర్మాణ సంస్థ.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న 'జైలర్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. జైలర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తాజాగా రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేయడం ఫ్యాన్స్​కు భారీ కిక్ ఇచ్చినట్లు అయింది. కాగా, రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.

ఇదీ చూడండి: బింబిసార్ 2 అప్డేట్​.. షూటింగ్​ షురూ అయ్యేది అప్పుడే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.