మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్‌ఫాదర్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతుంది. మలయాళీ హిట్ లూసీఫర్ రీమేక్‍గా వచ్చిన ఈ మూవీకి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి వసూళ్లను అందుకుంటోంది.
తాజాగా గాడ్‌ఫాదర్ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. సినిమాపై ప్రశంసలు కురిపించారు. చాలా ఆసక్తిగా కూడా ఉందని అన్నారు. ఈ విషయాన్ని గాడ్‌ఫాదర్‌ను తెరకెక్కించిన దర్శకుడు మోహన్‌రాజా ట్వీట్ చేశారు. "సూపర్ స్టార్ రజినీకాంత్ గాడ్ ఫాదర్ చిత్రాన్ని చూశారు. చాలా బాగుంది అన్నారు. తెలుగు వెర్షన్ కోసం చేసిన అనుసరణలను గురించి ఆయన ప్రశంసించారు. చాలా చాలా ధన్యావాదాలు సర్. నా జీవితంలోని అత్యుత్తమ క్షణాలలో ఇది కూడా ఒకటి." అని రాసుకొచ్చారు.
కాగా, దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. పొలిటికల్ నేపథ్యంలో ఉన్న ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు డైరెక్టర్ మోహన్ రాజా తన తదుపరి సినిమా అక్కినేని నాగార్జున-అఖిల్‌తో కలిసి మల్టీస్టార్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇదీ చూడండి: కాంతారా సుందరి సప్తమి గౌడ గురించి ఈ విషయాలు తెలుసా