ETV Bharat / entertainment

ఒకే ఫ్రేమ్​లో రజనీ-కపిల్​.. సినిమా కోసమే కలిశారా? - రజనీకాంత్ కపిల్ దేవ్ ఫొటో వైరల్​

ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్‌, కపిల్‌ దేవ్‌ని చూసిన క్రికెట్‌, సినిమా అభిమానులు తెగ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Rajnikanth kapil Dev
ఒకే ఫ్రేమ్​లో రజనీ-కపిల్
author img

By

Published : May 18, 2023, 10:11 PM IST

Updated : May 18, 2023, 10:35 PM IST

భారత్​లో క్రికెట్- సినిమాకు ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఈ రెండిటికి విడదీయలేని అనుబంధం కూడా ఉంది. ఈ రెండు రంగాలకు సంబంధించిన వారు ఒకే స్టేజ్​పై కనపడినా లేదా ఒకే ఫ్రేమ్​లో కనిపించినా.. అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెగ సంబరపడిపోతారు. అయితే తాజాగా ఈ రెండు రంగాలలోని ఇద్దరు లెజెండ్స్.. చేతులు కలపనున్నారు. అది కూడా ఓ సినిమా కోసం! వారు మరెవరో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్.

ప్రస్తుతం ఈ ఇద్దురు దిగ్గజాలు కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూడడంపై అటు సినీ అభిమానులు, ఇటు క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్​లో' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలో ఈ లెజెండ్స్​ ఇద్దరూ ముచ్చటిస్తూ కనిపిస్తుండడం వల్ల.. వీరిద్దరు ఎక్కడ, ఎందుకు కలుసుకున్నారని అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు.

విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య.. 'లాల్‌ సలామ్‌' సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌ మొయిదీన్ భాయ్‌ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్​గా ఫస్ట్​ లుక్​ పోస్టర్​ కూడా రిలీజై మంచి స్పందనను అందుకుంది. క్రికెట్ అండ్ యాక్షన్​ బ్యాక్ డ్రాప్​లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమా సెట్స్‌లోనే కపిల్​-రజనీ ఫొటో దిగారు. ఆ ఫొటోనే ఈ ఇద్దరు తమ సోషల్‌ మీడియా అకౌంట్స్​లో షేర్ చేస్తూ ఒకరిపై ఇంకొకరికి ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. 'గొప్ప వ్యక్తిని కలవడం గౌరవం' అని కపిల్‌ క్యాప్షన్​ రాయగా.. 'క్రికెట్‌లో భారత్​కు ఫస్ట్​టైమ్​ వరల్డ్‌ కప్‌ తీసుకొచ్చిన లెజండ్‌తో కలిసి పనిచేస్తుండడం గౌరవం' అని రజనీ రాసుకొచ్చారు. దీంతో కపిల్‌ ఆ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారా లేదా కపిల్‌ పాత్రలో తాను నటిస్తున్నారో అనేది రజనీకాంత్‌ క్లారిటీ ఇవ్వలేదు.

Rajnikanth kapil Dev
ఒకే ఫ్రేమ్​లో రజనీ-కపిల్

కాగా, కపిల్‌ దేవ్‌ ఇప్పటికే.. 'ఇక్బాల్‌', '83', 'డబుల్‌ ఎక్స్‌ఎల్‌' వంటి పలు చిత్రాల్లో గెస్ట్‌ రోల్‌లో కనిపించి సందడి చేశారు. ఇక ఈ చిత్రంతో పాటు రజనీకాంత్‌ 'జైలర్‌' అనే సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. దీనికి నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్​ కానుంది.

ఇదీ చూడండి: దీక్ష విరమించిన 'లైగర్' ఎగ్జిబిటర్లుదీక్ష విరమించిన 'లైగర్' ఎగ్జిబిటర్లు

Last Updated : May 18, 2023, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.